ETV Bharat / city

Hyderabad Pub Case: అభిషేక్, అనిల్‌ను కస్టడీ కోరిన పోలీసులు - hyderabad drugs case

Hyderabad Pub Case: బంజారాహిల్స్​లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పబ్‌లోని సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పబ్‌కు వచ్చిన వాళ్లలో అందరూ ఒకరి ఆహ్వానం మేరకే వచ్చారా..? లేదంటే బృందాలుగా వచ్చారా..? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Radisson pub
Hyderabad Pub Case
author img

By

Published : Apr 6, 2022, 11:07 AM IST

Hyderabad Pub Case: హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిందితులు అభిషేక్, అనిల్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టును విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నిందితుల తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది.

అనుమానాస్పద కదలికలు: పబ్ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.. ఇప్పటికే అభిషేక్‌తో పాటు పబ్ మేనేజర్ అనిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకొని.. వాటిని విశ్లేషిస్తున్నారు. అభిషేక్ చరవాణిలో పలువురి మాదక ద్రవ్యాల విక్రేతల ఫోన్ నంబర్లు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మాదక ద్రవ్యాల విక్రేతలకు, అభిషేక్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. పబ్‌పై దాడి చేసిన సమయంలో అక్కడ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. అతని ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు.

పబ్‌లోని సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పబ్‌కు వచ్చిన వాళ్లలో అందరూ ఒకరి ఆహ్వానం మేరకే వచ్చారా..? లేదంటే బృందాలుగా వచ్చారా..? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లందరి వివరాలను ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. వాళ్లలో ఎవరెవరు మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న అర్జున్, కిరణ్‌ల కోసం గాలిస్తున్నారు. అభిషేక్, అనిల్‌ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే, మాదక ద్రవ్యాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.