ETV Bharat / city

పోలీసుల దాష్టీకం.. మహిళలనీ చూడకుండా ఈడ్చిపడేశారు - మహిళలనీ చూడకుండా ఈడ్చిపడేశారు

మహిళా దినోత్సవం నాడు రాజధాని ప్రాంత మహిళా రైతులపై పోలీసుల దాష్టీకం ప్రదర్శించారు. మహిళలు అని కూడా చూడకుండా ఇష్టానుసారం ఈడ్చిపడేశారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పాదయాత్రగా బయల్దేరిన రాజధాని ప్రాంత మహిళలు, రైతులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పలువురు మహిళా రైతులు సొమ్మసిల్లిపడిపోగా.. కొంతమందికి గాయాలయ్యాయి.

పోలీసుల దాష్టీకం.. మహిళలనీ చూడకుండా ఈడ్చిపడేశారు

author img

By

Published : Mar 9, 2021, 9:45 AM IST

మహిళలు అని కూడా చూడకుండా ఇష్టానుసారం ఈడ్చిపడేశారు.. ఎక్కడ పడితే అక్కడ చేతులేసి లాగేశారు.. లాఠీలు ఝుళిపించారు. దొరికినవారిని దొరికినట్లు పట్టుకుని వాహనాల్లో కుక్కేశారు. ఈ తొక్కిసలాటలు, తోపులాటలు, పెనుగులాటల్లో కొంతమంది మహిళల దుస్తులు చిరిగిపోయాయి. మరికొంతమంది గాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచమంతా వారిని కొనియాడుతుంటే రాజధాని ప్రాంత మహిళా రైతుల పట్ల పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు.

పోలీసుల దాష్టీకం.. మహిళలనీ చూడకుండా ఈడ్చిపడేశారు
పోలీసుల దాష్టీకం.. మహిళలనీ చూడకుండా ఈడ్చిపడేశారు

అమరావతి పరిరక్షణ ఉద్యమం 447 రోజులకు చేరుకున్న సందర్భంగా.. మహిళా దినోత్సవం నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పాదయాత్రగా బయల్దేరిన రాజధాని ప్రాంత మహిళలు, రైతుల్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. అరెస్టులు, తోపులాటలు, మహిళల హాహాకారాలతో ప్రకాశం బ్యారేజీ, రాజధాని ప్రాంతమంతా రణరంగమైంది. పోలీసుల తీరుతో ఆవేదనకు గురై మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. మరికొందరు మహిళలు ప్రకాశం బ్యారేజీపైకి చేరుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ కృష్ణా నదిలో దూకేందుకు యత్నించారు. పోలీసులు ఎంతగా నిర్బంధించినా మహిళలు రాజధానిలో కవాతు చేసి.. ఉద్యమ స్ఫూర్తిని చాటారు.

అర్ధరాత్రి నుంచే పోలీసుల మోహరింపు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని గ్రామాలకు చెందిన మహిళా రైతులంతా పాదయాత్రగా తరలివెళ్లి విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి నుంచే నిర్బంధ చర్యలు అమలు చేశారు. ఐకాస నాయకుల ఇళ్లవద్ద బలగాల్ని మోహరించి బయటకొస్తున్న వారందర్నీ ఎక్కడికి వెళుతున్నారంటూ ప్రశ్నించారు. అడుగుడుగునా ఇనుపకంచెలు, బారికేడ్లు అడ్డం పెట్టారు. వాటిని దాటుకుని కొంతమంది మహిళలు కాలినడకన, మరికొందరు వాహనాల్లో వేకువజామునే మందడం, వెలగపూడి, రాయపూడి, నెక్కల్లు, పెదపరిమి, అనంతవరం, దొండపాడు తదితర ప్రాంతాల నుంచి విజయవాడవైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. సీడ్‌యాక్సెస్‌ రోడ్డుపై పోలీసులు వారిని అడ్డుకున్నారు.

మహిళల్ని ఈడ్చేసి.....

పోలీసుల ఆంక్షల్ని అధిగమించి అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నాయకురాలు రాయపాటి శైలజ, మరికొంత మంది మహిళలు ప్రకాశం బ్యారేజీపైకి చేరుకుని దుర్గగుడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డగించారు. తాము దుర్గమ్మ దర్శనానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని వారు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేయటంతో ఎస్సీ ఐకాస ప్రతినిధుల్ని పోలీసులు బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆత్మహత్య చేసుకుంటామంటూ రాయపాటి శైలజ, మిగతా మహిళలంతా ప్రకాశం బ్యారేజీ గోడలు ఎక్కి కృష్ణానదిలోకి దూకేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఇష్టానుసారం లాగి వాహనాల్లో తోసేశారు. దాదాపు గంటన్నరపాటు ప్రకాశం బ్యారేజీవద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న రాజధాని రైతులందర్నీ పోలీసు వాహనాల్లో కుక్కేసి, మంగళగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. మూడు గంటల తర్వాత వారందర్నీ తీసుకొచ్చి మందడంలో విడిచిపెట్టారు.

రోడ్డుపై బైఠాయింపు.. నిలిచిన ట్రాఫిక్‌

మరోవైపు రాయపూడి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, వెలగపూడి నుంచి రాజధాని పరిధిలోని మందడం గ్రామానికి వచ్చే దారి, వెంకటపాలెం వద్ద పోలీసులు ఇనుప కంచెలు వేశారు. ఉద్దండరాయునిపాలెం, మోదుగులింగాయపాలెం తదితర గ్రామాల నుంచి మందడం వచ్చే అన్ని రోడ్లను బ్యారికేడ్లు, ఇనుప కంచెలతో మూసివేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించటంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

లాఠీలు ఝుళిపించిన పోలీసులు

లైబ్రరీ కూడలి వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొచ్చి పంపిణీ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వెలగపూడి నుంచి మల్కాపురం వైపు ఎవరూ రాకుండా ఇనుప కంచె వేశారు. వాటిని తోసుకెళ్లేందుకు మహిళలు, రైతులు యత్నించడంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో మహిళలు కిందపడిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. దాదాపు 12 గంటలపాటు రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు నిరసనలను అడ్డుకోవడానికి కంచెలు వేయడంతో సచివాలయానికి వెళ్లే ఉన్నతాధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇదీ చూడండి:

'విశాఖ ఉక్కు, అనుబంధ సంస్థల్లో 100 శాతం వాటాలు అమ్మేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.