విజయవాడలో సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ముగిసింది. 15 రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. వీలైనంత త్వరగా కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాలని తేల్చారు.
పోలవరంలో 41.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వకు వీలుగా కాఫర్ డ్యాం నిర్మించనున్నారు. ఆ మేరకే భూసేకరణ, పునరావాస పరిహారం అమలు చేయాలని తీర్మానించారు. పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ పాల్గొన్నారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్ ఇంజినీర్, పీపీఏ సభ్య కార్యదర్శి రంగారెడ్డి సమావేశానికి హాజరయ్యారు.
ఇవీచూడండి: ఈ ఏడాదిలో నేరాలు తగ్గాయ్.. మరింత మెరుగుపడ్డాం: డీజీపీ