రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విజయవంతంగా నిర్వహిస్తుంన్నందుకు, వృక్షవేదం పుస్తకానికి గానూ ప్రశంసలు కురిపించారు. పచ్చదనం పెంపు దిశగా యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారని ప్రధాని అభినందించారు.
ప్రకృతితో మనిషికున్న అనుబంధం తెలిపే పుస్తకం.. వృక్షవేదని మోదీ అభివర్ణించారు. వృక్షవేదం పుస్తకం అందరూ చదవి ప్రేరణ పొందాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రకృతిపరంగా గొప్ప వారసత్వాన్ని రక్షించుకునేందుకు కృషి చేయాలని మోదీ కోరారు.
ప్రశంసా లేఖకు గానూ... ప్రధానికి ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటితే బాగుంటుందని మోదీకి సంతోష్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: