"ప్రేమ అంటే ఏంటీ..?" ప్రశ్న చిన్నదే.. సమాధానం రాయడానికి పుస్తకాలు కూడా సరిపోవు. ఈ ప్రేమ గంట కొట్టని మనిషి.. మనసు.. ఈ భూమ్మీద ఉండదు. అయితే.. హార్ట్ ఫుల్‌గా లవ్ చేసే వారు ఉన్నట్టే.. ప్రేమ పేరుతో చీటింగ్ చేసేవారూ.. పెళ్లైన తర్వాత కూడా పక్కచూపులు చూసేవాళ్లకూడా మన చుట్టూ ఎంతో మంది. ఈ లిస్టులో ఆడ బ్యాచ్ కూడా ఉన్నప్పటికీ.. మగ పురుగులే ఎక్కవ అన్నది ఓ అంచనా. ఇలాంటి వాళ్ల హార్ట్ ఓ ఐమాక్స్ థియేటర్.. ఎట్ ఏ టైమ్.. మూడ్నాలుగు లవ్‌స్టోరీలు రన్ అవుతూనే ఉంటాయి. ఇలాంటి జాదూగాళ్లను కనిపెట్టడం అంత వీజీ కాదు. స్పెషలిస్టులు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అలాంటి స్పెషల్ ఏజెంటే.. కరోలినా లెక్కర్.
ప్రస్తుతం బార్సిలోనాలో నివసిస్తున్న ఈమె.. వృత్తిరిత్యా ప్లేబాయ్ మోడల్. ఇన్‌స్టాగ్రామ్ లో స్టార్ కూడా. మోడలింగ్ చేస్తూనే.. "ఏజెంట్" పనికూడా కొనసాగిస్తోంది. ఛీటింగ్ బాయ్ ఫ్రెండ్స్‌ను కనిపెట్టడమే ఈమె డ్యూటీ. ఇందుకోసం 2 వేల డాలర్లు ఫీజుగా తీసుకుంటోంది. ఒక కేస్ టేకప్ చేసిన తర్వాత రంగంలోకి దిగుతుంది. ముందుగా.. అతని ఫోన్ నంబర్ నుంచి, సోషల్ మీడియా అకౌంట్ల వరకూ అన్ని డీటెయిల్స్ తీసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి అయితే.. చాటింగ్ ద్వారా "హాయ్.." అంటూ పలకరిస్తుంది. అటువైపు నుంచి వచ్చే రెస్పాన్స్‌కు అనుగుణంగా.. స్పీడ్ పెంచుతుంది.
ఘాటు మాటలతో రెచ్చగొడుతుంది.. హాట్ ఫొటోలతోనూ కవ్విస్తుంది.. లవ్ అంటుంది.. బయట కలుద్దామని చెబుతుంది.. చివరకు.. "వన్ నైట్ స్టాండ్" ఆఫర్ కూడా ఇస్తుంది. అవసరమైతే.. కొన్ని రోజులు ట్రావెల్ కూడా చేస్తుంది. ఇలా.. ఎన్ని విధాలుగా ఛాన్సుంటే.. అన్ని విధాలుగా ట్రై చేస్తుంది. అవతలివాడు నిజంగా ఛీటర్ అయితే.. వెంటనే ఓపెన్ అయిపోతాడు.. తాళింపు మాడిపోయే దాకా పులిహోర కలుపుతూనే ఉంటాడు.
"ఆపరేషన్" ముగిసింది అని నిర్ధారించుకున్న తర్వాత.. రిపోర్టు తయారు చేసి "గర్ల్ ఫ్రెండ్"కు పంపిస్తుంది. ఈ టెస్ట్‌లో బాయ్ ఫ్రెండ్ గలీజుగాడని తేలితేనే.. డబ్బులు తీసుకుంటుంది. అలా కాకుండా.. రాముడు మంచి బాలుడు టైప్ అయితే మాత్రం.. తీసుకున్న ఫీజు వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది. ఎంత మంచి ఏజెంటో కదా!
"నేను మొదట వారిని ఇన్‌స్టాగ్రామ్‌లో టచ్ చేస్తాను. వారు రిప్లే ఇచ్చే వరకు వెయిట్ చేస్తాను. హాట్‌గా మాట్లాడుతాను. ఒకవేళ అతను నన్ను కలవాలని అన్నాడంటే.. అతను ఫెయిల్ అయినట్టే.. అప్పుడు నేను డబ్బు తీసుకుంటాను. లేదంటే.. తిరిగి ఇచ్చేస్తాను." అని డైలీ స్టార్ వార్తాపత్రికతో చెప్పింది కరోలినా లెక్కర్.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ.. మెజారిటీ "ఫ్లర్టింగ్ బ్యాచ్"తోనే నిండిపోయి ఉన్నాయి. ప్రేమ పేరుతో వీళ్లు కలిపే పులిహోర మాములుగా ఉండదు. ఇలాంటి వాళ్ల హృదయం ఓ పుష్పక విమానమే. ఎంత మందిని "ప్రేమించినా".. కొత్తవారికి చోటు ఉంటూనే ఉంటుంది..! నిజంగా.. ఇలాంటి వాళ్లను పట్టుకునే ఏజెన్సీ పెడితే.. ఏజెంట్‌కు తీరికే ఉండదనుకుంటా కదా!
వీటిపైనా ఓ క్లిక్కేయండి..
- అర్జెంటుగా లావు తగ్గాలా..? వాళ్లు చిటికెలో పిండేస్తారు..!!
- "యమధర్మా.. వచ్చుచుంటిని.." ఫుల్లుగా తాగి నదిలో దూకేశాడు!
- వీళ్ల పెళ్లి జరుగుతుంది మళ్లీ.. మళ్లీ.. మూడేళ్లకోసారి విడాకులు!!
- పెళ్లైన ఏడాది తర్వాత తెలిసింది.. "మొగుడు" ఒక అమ్మాయి అని!
- "గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని" రూ.15 లక్షలు ఫైన్ వేసిన జడ్జి..!
- అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!
- మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!