దేశంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. కొవిడ్ నేపథ్యంలో వ్యవసాయ పరిశోధన, విస్తరణ రంగాల్లో అనూహ్య మార్పులు తప్పనిసరయ్యాయి. డిజిటల్, మొబైల్ టెక్నాలజీ, శాటిలైట్, డ్రోన్ సాంకేతికత, కృత్రిమ మేథ, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, అంతరిక్ష పరిజ్ఞానం, రోబోటిక్స్ టెక్నాలజీ.. ఇలా ఎదో ఒక రూపంలో సాగుపై సాంకేతికత ప్రభావం ఉంటోంది. ఇందుకు అనుగుణంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) చర్యలు చేపట్టింది.
వినియోగదారుల ఆహార అలవాట్లకు అనుగుణంగా.. ఐదారేళ్లుగా కార్నెల్ వర్సిటీ, ఫ్లోరిడా విశ్వవిద్యాలయం, పొనెహెం యూనివర్సిటీ, మనీలా అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలను ఎంపిక చేసుకుని సీడ్స్ సైన్స్ టెక్నాలజీ, వరి పరిశోధనల్లో కలిసి పనిచేస్తోంది.
తెలంగాణ సోనాకు.. జాతీయ, అంతర్జాతీయంగా ప్రాముఖ్యత తీసుకొచ్చేందుకు పీజేటీఎస్‌ఏయూ- ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. 6.2 ఎంఎం వండగాలకు డిమాండ్ ఉన్న దృష్ట్యా.. ఆ రకం వరి విత్తనాలు, ఓలిక్ యాసిడ్స్ గల నూనెగింజలు, అప్లాటాక్సిన్ తక్కువ గల వేరుశనగ వండగాలు అభివృద్ధి చేస్తోంది.
వ్యవసాయం అనేది ఆహార భద్రతతో ముడిపడకుండా ఫీల్డ్ టూ ఫోర్క్ అన్న పద్ధతిలో ముందుకు వెళ్తున్నామంటున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి..
ఇవీచూడండి: ఇంటి పంటతో ఆరోగ్యం మరింత పదిలం!