ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మండలి కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చారు. ఈనెల 19న ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మంత్రిగా ఏడాది కాలం సంతృప్తిగా పని చేశానని సుభాష్ చంద్రబోస్ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. పార్లమెంటుకు వెళ్లాలన్నది తన చిరకాల కోరికన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని.. అయితే హోదా వస్తుందని తనకు నమ్మకం లేదన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని స్పష్టంచేశారు.
రఘురామకృష్ణరాజు వ్యవహారంపై స్పందిస్తూ.. ఎంపీలు ఎవరైనా పార్టీకి విధేయులుగా ఉండాలని సూచించారు. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా శిరోధార్యంగా భావించాలని తెలిపారు.
ఇదీ చూడండి : నాణ్యతాలోపంతోనే 'కొండపోచమ్మ'కు గండి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి