ETV Bharat / city

అదిరిందయ్యా... నీ ఆతిథ్యం - పావురాలకు ఆహారం

గ్రామాలలో ఉండే పక్షులకైతే ఆహారం పుష్కలంగా దొరుకుతుంది... ఎందుకంటే చెట్లు, నీళ్లు ఉంటాయి. మరి పట్టణాల్లో ఉన్న పక్షుల పరిస్థితి ఎంటి? ఎక్కువ సంఖ్యలో ఉండే పావురాల్లాంటి పక్షులకు ఆహారం ఎలా? అది ఆలోచించిన ఓ వ్యక్తి పావురాలకు ఆతిథ్యం ఇస్తున్నాడు. గత మూడేళ్లుగా ఇలాగే చేస్తున్నాడు విజయవాడకు చెందిన నిమ్మగడ్డ చైతన్య.

pegion food
అదిరిందయ్యా... నీ ఆతిథ్యం
author img

By

Published : Jan 19, 2020, 12:06 PM IST

అదిరిందయ్యా... నీ ఆతిథ్యం

స్థిరాస్తి వ్యాపారం చేసే ఆంధ్రప్రదేశ్​లోని నిమ్మగడ్డ చైతన్య విజయవాడలోని పటమటలో నివాసం ఉంటున్నారు. బెంజిసర్కిల్ సమీపంలోని తన బంధువుకు చెందిన భవనం చూసేందుకు వెళ్లారు. అక్కడ ఆకాశంలో గుంపులుగా తిరుగుతున్న అడవి పావురాలను చూశారు. వాటికి ఆహారంగా జొన్నలను డాబాపై చల్లారు. గింజలను తింటున్న పావురాలను చూసి ఆనందం కలగడం వల్ల ప్రతిరోజూ గింజలు వేయడం ప్రారంభించారు.

మొదట 30 పావురాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య వందకు చేరింది. మధ్యాహ్నం అయితే చాలు పావురాలు అక్కడికి చేరుకొని చైతన్య కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రతి నెల 60 నుంచి 70 కిలోల జొన్నలు పావురాలకు ఆహారంగా వేస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు వాటికి భోజన సమయం. ఆ సమయంలో మాత్రమే పావురాలు అక్కడికి వస్తుంటాయి.

ఆయన పని మీద బయటకు వెళ్లినా.. ఊరెళ్లినా స్నేహితుల ద్వారా పావురాలకు ఆహారం అందిస్తారు. వాటిని చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా, సంతోషంగా ఉంటుందని పావురాలకు ఆహారం వేయడం అభిరుచిగా మారిపోయిందని చైతన్య తెలిపారు.

ఇవీ చూడండి: వికారాబాద్​లో మైనర్​బాలికపై అత్యాచారం

Intro:AP_VJA_50_18(VO)_GUEST_PIGEONS_EVERY_DAY_COME_FOR_LUNCH_737_AP10051

ఆకాశంలో గుంపులుగా తిరుగుతూ హోర్డింగ్ లపై వాలుతూ ఆహారం నీటి కోసం గాలిస్తున్న అడవి పావురాలు చూసి మనసు చలించింది. ముచ్చటగొలిపే పావురాలకు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నారు. డాబా పై గింజలు వేస్తే వస్తాయో రావో నని సందేహంతో జొన్నలు వేశారు. పావురాలు డాబా పై వాలి గింజలన్నీ తినేసి ఎగిరిపోయాయి. మరుసటి రోజు అదే సమయానికి ఆతిధ్యం స్వీకరించేందుకు ఆకాశంలో చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. క్రమంగా పావురాల సంఖ్య పెరిగినా, వాటి పట్ల ఉన్న ప్రేమ మమకారంతో గత మూడేళ్లుగా పావురాలకు ఆతిథ్యమిస్తున్నారు విజయవాడకు చెందిన నిమ్మగడ్డ చైతన్య.

స్థిరాస్తి వ్యాపారం చేసే నిమ్మగడ్డ చైతన్య పటమట లో నివాసం ఉంటున్నారు. బెంజిసర్కిల్ సమీపంలోని తన బంధువుకు చెందిన భవనం చూసేందుకు వెళ్లారు. అక్కడ ఆకాశంలో గుంపులుగా తిరుగుతున్న అడవి పావురాలను చూశారు. వాటికి ఆహారంగా జొన్నలను డాబా పై చల్లారు. గింజలను తింటున్న పావురాలు చూసి ఆనందం కలగడంతో ప్రతిరోజు వేయడం ప్రారంభించారు. తొలుత 30 పావురాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య వందకు చేరుకుంది. మధ్యాహ్నం అయితే చాలు అక్కడికి చేరుకొని చైతన్య కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఆయన వచ్చి జొన్నలు డాబాపై చల్లుతూ ఉంటే చూసి, అక్కడక్కడే డాబా పైన ఎగురుతుంటాయి. ఆయన జొన్నలు వేసి దూరంగా వెళ్ళిపో గానే పావురాలన్నీ ఒక్కసారిగా వచ్చి డాబాపై వాలిపోయి మొత్తం తినేస్తాయి. ప్రతి నెల 60 నుంచి 70 కిలోల జొన్నలు పావురాలకు ఆహారంగా వేస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు వాటికి భోజన సమయం. ఆ సమయంలో మాత్రమే పావురాలు అక్కడికి వస్తుంటాయి. ఆయన పని మీద బయటకు వెళ్లిన ఊరు వెళ్లిన స్నేహితుల ద్వారా పావురాలకు అతిథ్యం ఇస్తున్నారు. వాటిని చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుందని పావురాలకు ఆహారం వేయడం అభిరుచి గా మారిపోయింది అంటున్నారు చైతన్య.

బైట్............. నిమ్మగడ్డ చైతన్య

- షేక్ ముర్తుజా, విజయవాడ ఈస్ట్, 8008574648.

Body:పావురాలకు ఆతిథ్యమిస్తున్న వ్యక్తి

Conclusion:పావురాలకు ఆతిథ్యమిస్తున్న వ్యక్తి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.