ETV Bharat / city

నియమాలు పాటిస్తే చాలు.. మీరే స్మార్ట్​ఫోన్​ బెస్ట్ ఫొటో గ్రాఫర్ - Smart Phones

ఒకప్పుడు ఫొటోగ్రఫీ అంటే అదో పెద్ద పని. ఇంట్లో ఎక్కడో చిన్న కెమెరా ఉండేది. దానిని బంగారం కంటే జాగ్రత్తగా చూసుకునేవాళ్లం. పండగలు, పబ్బాలకు మాత్రమే.. అది స్పెషల్. ఆ ఒక్క రోజే అది బయటకు వచ్చి మెరిసిపోతుంది. తర్వాత మళ్లీ భద్రంగా బీరువాలో దాచేసేవాళ్లం. కానీ ఇప్పుడంతా సెల్ఫీల రాజ్యం. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. కానీ అందరూ స్మార్ట్​ ఫోన్ కళ్లతో ఫొటోలు బాగా తీయగలరా..?

నియమాలు పాటిస్తే చాలు.. మీరే స్మార్ట్​ఫోన్​ బెస్ట్ ఫొటో గ్రాఫర్

author img

By

Published : Mar 20, 2021, 5:14 AM IST

ఇప్పుడంతా సోషల్​ మీడియా.. ఫొటోగ్రాఫర్లదే హవా. సరైన ఫొటో ఒక్కటి పడితే చాలు. లైకులే.. లైకులు.. కామెంట్లు. ఫోన్​ కెమెరా చాలు.. ఎంత అందాన్నైనా బంధించేందుకు. డీఎస్​ఎల్​ఆర్ అవసరం లేదు. ఫొటో షూట్​ కెళ్లినా.. ఏదైనా టూర్​కెళ్లినా.. కొన్ని నియమాలు పాటిస్తే చాలు. మీరూ అయిపోవచ్చు.. స్మార్ట్​ఫోన్​ బెస్ట్ ఫొటో గ్రాఫర్..!

లెన్స్​పై ఓ కన్నేయండి..

మీ కళ్లకు దుమ్ము పడితే.. ఏదైనా చూడగలరా..? అబ్బే కష్టం. మరీ కెమెరా కళ్లనెందుకు పదేపదే టచ్ చేసి పాడుచేస్తారు. లెన్స్ మురికిగా ఉంటే.. ఫొటోలు సరిగా రావు. అలా అని చేత్తో తూడ్చడం ఆపేయండి. వేలిముద్రలు పడి.. ఫొటోలు సరైన కాంతితో రావు. మెత్తటి వస్త్రం, శుభ్రపరిచే స్ర్పేను మీతో ఉంచుకోండి.

కాస్త వెలుతురును చూడండి..

ఫొటోగ్రఫీకి ముఖ్యమైనది లైటింగ్. ఏ సమయంలో ఎటునుంచి ఫొటో తీయాలో ఓ అవగాహన ఉండాలి. సూర్యుడికి ఎదురుగా ఫొటో తీశారనుకో.. సబ్జెక్ట్ సరిగా ఫోకస్ కాదు. కాంతిని సరిగా వాడుకుంటే.. ఫొటోకు మంచి మంచి ఎఫెక్ట్స్ వస్తాయి. పగడి పూట సూర్యుడి కాంతిని సరిగా వాడుకుంటే మీరు.. మంచి ఫొటో తీయోచ్చు. రాత్రి వేళల్లో మాన్యువల్ సెట్టింగ్స్​ను సరిచేసుకుని ప్రయోగాలు చేయొచ్చు. స్ట్రీట్​ ఫొటోగ్రఫీకి వెనక ఎప్పుడూ ఓ నేపథ్యం, కథాంశం ఉండాలి. ఫ్రేమింగ్​పై కసరత్తు చేస్తే ఫాలోవర్స్ ఎప్పుడూ మీ వెంటే.

ఫోకస్.. చాలా ముఖ్యం బాస్

అసలు మీరు దేన్ని ఫొటో తీయాలనుకుంటున్నారో... దానిపై స్పష్టత ఉండాలి. సబ్జెక్ట్​ను వస్తుందిలే..అని స్మార్ట్​ ఫోన్​ను కాస్త పక్కకు జరిపినా.. మీ ఫొటోగ్రఫీకి మైనస్ మార్కులు పడతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లలో మంచి ఫోకస్​ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఫీల్డ్​ డెప్త్​ బ్యాక్ గ్రౌండ్ బ్లర్, మోషన్ క్యాప్చర్ వంటి ఎన్నో కొత్తం అంశాలు మీ ఫోన్​లో ఉన్నాయి ఒక్కసారి చూసుకోండి.

జూమ్ చేస్తున్నారా.?

కెమెరా ఉంది కదా అని జూమ్ చేస్తున్నారా..? ఆగండి. ప్రొఫెషనల్​ కెమెరాల్లో ఉండే జూమ్ నాణ్యత మన స్మార్ట్ ఫోన్​లలో ఉండదు. ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీసేప్పుడు జూమ్ ఆప్షన్​ను వాడకపోవడమే ఉత్తమం. ఏ అంశాన్నైతే ఫోకస్ చేశారో.. దానికి దగ్గరగా వెళ్లడం వలన నాణ్యత చెడిపోకుండా ఉంటుంది. వీలైతే ఎడిటింగ్ చేసేప్పుడు ఫొటోను క్రాప్ చేసుకోండి.

ఎడిటింగ్​తో జాగ్రత్త

ఫొటో తీస్తే.. దానికి అనవసరమైన ఎడిటింగ్ చేయడం మనకు అలవాటు. ఏవేవో ఎఫెక్ట్స్ వాడతాం. ఎడిటింగ్​లో ఫిల్టర్స్​కు అవకాశం అస్సలు ఇవ్వకండి. అవి ఫొటోలోని సహజత్వాన్ని చంపేస్తాయి. ఇక మీరు ఫొటో తీసి ఏం లాభం. నెచురల్​గా ఉంటేనే ఫొటోకు అందం.

ఓపిక కావాలి

కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా.. మంచి షాట్స్ రావు. మంచి ఫొటోకోసం ఎంతసేపైనా ఎదురుచూడాలంటారు ఫొటోగ్రాఫర్లు. ఒక్క క్షణంలో బంధించేసే ఫొటో.. ఒక్కోసారి నిమిషాలు, గంటలు పడుతుంది. సూర్యుడు ఉదయించే సమయం, అస్తమించే సమయంలో ఫొటోలు బాగా వస్తాయి. ఈ సమయాన్ని గొల్డెన్ అవర్ అంటారు.

మీరేప్పడు విద్యార్థే..

నిజమైన ఫొటోగ్రాఫర్లు కొత్త విషయాల్ని ఎల్లప్పుడూ..నేర్చుకునే ఉంటారు. సరికొత్త ఆలోచనలు, అంశాలను శోధించడంలోనే అసలైన విజయం. ఒక్కొసారి స్మార్ట్​ ఫోన్​లోనే గొప్ప ఫొటోలు రావొచ్చు. ఎన్ని నేర్చుకున్నా ప్రయోగాలు చేయనిదే ఫొటోగ్రఫీలో ఆరితేరమనేది గుర్తుంచుకోవాలి.

ఇంకో ముఖ్యమైన విషయం.. మీ ఫోన్​ కెమెరాతో చూడటం కంటే ముందు.. తీయాలనుకునే సబ్జెక్ట్​ను మీ మనసుతో ఒక్కసారి ఆస్వాదించండి. అప్పుడు ఫొటో తీయండి.. మీరే బెస్ట్ ఫొటో గ్రాఫర్..!

ఇదీ చూడండి : పాఠశాలల్లో విజృంభిస్తున్న కరోనా.. రెండ్రోజుల్లో 150కి పైగా కేసులు‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.