రంగారెడ్డి జిల్లా గోపనపల్లి భూముల విషయంలో చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తన భూముల్లో రెవెన్యూ అధికారులు చొరబడుతున్నారని, నోటీసులు ఇవ్వకుండా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఆ భూముల విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. ఒకవేళ తీసుకుంటే చట్టపరమైన ప్రక్రియను అనుసరిస్తామని అన్నారు. ఏజీ వివరణను నమోదు చేసిన హైకోర్టు... చట్టం ప్రకారం వ్యవహరించాలని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను ముగించింది.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: క్లీన్గా మారిన నాగర్కర్నూల్ కలెక్టరేట్