పాపం అభాగ్యుడు.. పాడె వదిలినా ప్రాణం నిలవలేదు. అంత్యక్రియలకు తీసుకెళుతుండగా లేచి కూర్చొన్న ఓ వ్యక్తి.. 24 గంటలు గడవక ముందే ప్రాణాలు విడిచాడు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో చనిపోయినట్లు భావించి గ్రామస్థులు అంత్యక్రియలకు తీసుకెళుతుండగా స్పృహలోకి వచ్చిన ఘటన సోమవారం జరిగింది.
రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఆయన్ను మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: పైసలిస్తేనే జనన, మరణ ధ్రువపత్రాలు