ETV Bharat / city

గేదెల కష్టాలను తోటి గేదెలే తీర్చాయి.. ఎక్కడంటే..? - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

PROTEST: సచివాలయ సిబ్బంది నిర్వాకంతో సచివాలయానికి గేదెలు (buffalos in village secretariat) క్యూ కట్టాయి. స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేద్దామనుకున్న ప్రజలకు, తమకంటే ముందే గేదెలుండటంతో.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. గేదెల రాక వెనుక కారణం తెలుసుకున్న ప్రజలు.. ఔరా! గేదెల కష్టాలను గేదెలే తీర్చుకున్నాయని ముక్కు మీద వేలేసుకున్నారు. గేదెలేంటీ.. కష్టాలేంటి.. అని అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే..

గేదెల కష్టాలను తోటి గేదెలే తీర్చాయి.. ఎక్కడంటే..?

author img

By

Published : Aug 2, 2022, 7:37 PM IST

గేదెల కష్టాలను తోటి గేదెలే తీర్చాయి.. ఎక్కడంటే..?

Buffalos in Village Secretariat: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఏటుకూరులో వార్డు సచివాలయ సిబ్బంది వింత పరిష్కారం.. వినూత్న నిరసనకు దారి తీసింది. తమ పక్కింటి నుంచి వస్తున్న గేదెల వాసనతో ఇంట్లో ఉండటం కష్టమవుతోందంటూ.. స్పందన కార్యక్రమంలో భాగంగా ఓ వ్యక్తి ఏడాదిగా ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నాడు. వరుస అర్జీలతో గేదెల యజమాని బూరగడ్డ శ్రీనివాస్‌కు సచివాలయ సిబ్బంది నోటీసులిచ్చారు. సమాధానం రాకపోవడం వల్ల.. శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు.. శ్రీనివాస్‌కు చెందిన గేదెలను తీసుకొచ్చి గ్రామ సచివాలయ ప్రాంగణంలో కట్టేశాడు. దూడలను మాత్రం అతని ఇంట్లోనే వదిలేశారు. అర్జీని పరిష్కరించకపోతే పైఅధికారులు తమను సస్పెండ్ చేస్తారంటూ.. పాలు కావాలంటే సచివాలయానికే వచ్చి తీసుకెళ్లొచ్చని చెప్పారు. అంత వరకూ సరేలే అనుకున్నా.. తీసుకెళ్లిన గేదెలకు రోజంతా సిబ్బంది మేత వేయకపోవడంతో ఆగ్రహం తెచ్చుకున్న యజమాని నిరసన చేపట్టాడు.

Villagers Protest with buffalos: శ్రీనివాస్ నిరసనకు మద్దతుగా.. స్థానికులు తమ గేదెలతో కార్యాలయాన్ని ముట్టడించారు. నోరు లేని జీవులపై ఇంత కఠినంగా వ్యవహరిస్తారా అంటూ గ్రామస్థులు మండిపడ్డారు. స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించని సిబ్బంది.. పాలు ఇచ్చే గేదెలపై ఇలా వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరాపై దృష్టి సారించకుండా.. ఫిర్యాదుదారుడు ఇచ్చే లంచాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. గ్రామస్థుల ఆందోళనతో మెట్టు దిగిన నగరపాలక సంస్థ అధికారులు.. కట్టేసిన గేదెలను వదిలిపెట్టారు. అధికారుల చర్యలతో శాంతించిన గ్రామస్థులు.. ఆందోళన విరమించారు.

ఇవీ చదవండి:

'ప్రతి కార్యకర్త ఉగ్ర నరసింహుడి అవతారమెత్తాలి.. కేసీఆర్​ను గద్దె దించాలి'

సెక్స్​ గురించి కరణ్ ప్రశ్న.. నటి దీటైన రిప్లై.. పంచ్​లతో ఆమిర్ సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.