ETV Bharat / city

అమ్మో కరోనా ఉందేమో..!  కొవిడ్​ పరీక్షల కోసం బారులు

author img

By

Published : Jul 10, 2020, 9:19 AM IST

దగ్గు, తుమ్ము, తలనొప్పి, జ్వరం, జలుబు వంటి సమస్యలు ఏ ఒక్కరిలో కనిపించినా కుటుంబమంతా కుదేలవుతోంది. కరోనా లక్షణాలా, కాదా అని తేల్చుకోలేక మానసికంగా నరకం అనుభవిస్తున్నారు. కరోనా ఉన్నవారి ఇంట్లో వేర్వేరు గదులు లేని కుటుంబాల దుస్థితి వర్ణణాతీతం. అయినప్పటికీ చాలామంది ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

people afraid of increasing corona cases in ghmc
గ్రేటర్​లో కొవిడ్​ పరీక్షల కోసం వరుస కడుతున్న ప్రజలు

కొవిడ్‌ ధాటికి కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పాజిటివ్‌ కేసులు నమోదైన ఇళ్లలో వాతావరణం మరింత గందరగోళంగా మారుతోంది. ఏ ఒక్కరికి వైరస్‌ సోకినా.. మిగిలిన వారంతా పరీక్షల కోసం ఆస్పత్రులకు వరుస కడుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో 918 మందికి పాజిటివ్‌ అని తేలింది. రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్‌లో 67 కేసులు నమోదయ్యాయి.

ఏం చేయాలో తెలియక..

నగరవ్యాప్తంగా ఇప్పటి వరకు 25 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. కొంతకాలంగా రోజుకు 1500 పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కొవిడ్‌కు గురవుతున్న సందర్భాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చిన్నారులు, వృద్ధ బాధితుల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇంట్లో వేర్వేరు గదులు లేని కుటుంబాల దుస్థితి వర్ణణాతీతం. అయినప్పటికీ చాలామంది ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

యూసఫ్‌గూడలో వేగంగా..

శేరిలింగంపల్లి జోన్‌లోని నాలుగు సర్కిళ్లలో కలిపి గురువారం 92 కేసులు నమోదైతే, ఒక్క యూసఫ్‌గూడ సర్కిల్లోనే 61మంది కొవిడ్‌ బారినపడ్డారు. బస్తీలు, కాలనీల్లో వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. స్థానికంగా మార్కెట్లు, దుకాణ సముదాయాల వద్ద ప్రజలు అజాగ్రత్తగా తిరుగుతుండటం అందుకు ప్రధాన కారణమంటున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్‌లో 18, చందానగర్‌లో 13 మంది బాధితులు వెలుగులోకిరాగా, పటాన్‌చెరులో ఒక్క కేసూ నమోదు కాలేదు. శివారు ప్రాంతమైన కుత్భుల్లాపూర్‌లోనూ మహమ్మారి స్వైర విహారం చేస్తోంది.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలో 43 కేసులు నమోదయ్యాయి. సూరారం పట్టణ ఆరోగ్యకేంద్రంలో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. షాపూర్‌నగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో 31 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి, కుత్బుల్లాపూర్‌ ఆరోగ్య కేంద్రంలో 26 మందికిగాను ఐదుగురికి కొవిడ్‌ ఉన్నట్లు తేలింది. షాపూర్‌నగర్‌, నెహ్రూనగర్‌, ప్రసూననగర్‌, భగత్‌సింగ్‌ నగర్‌, గణేష్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన మరో 20 మంది బాధితులు జాబితాలో ఉన్నారు. ప్రసూన నగర్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కరోనా చికిత్స తీసుకుంటూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలో 41 కేసులు నమోదయ్యాయి. అందులో కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని 4, 6, 7, 9, 13వ ఫేజ్‌లతో పాటు వసంత్‌నగర్‌, లోథా భవన సముదాయానికి చెందిన 18 కేసులు ఉన్నాయి.

మూసాపేట డివిజన్‌లోని జనతానగర్‌, భరత్‌నగర్‌, రెయిన్‌బో విస్టాస్‌లో 6, కూకట్‌పల్లి డివిజన్‌ పాపారాయుడు నగర్‌, శాంతినగర్‌లో 3, బాలానగర్‌ డివిజన్‌ ఫిరోజ్‌గూడ, రాజుకాలనీలో 2, ఫతేనగర్‌ పిట్లబస్తీలో 1, వివేకానంద నగర్‌ కాలనీ, మాధవరం కాలనీలో 2, ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ జయానగర్‌, శాతవాహన నగర్‌, ధరణీనగర్‌లో 4, మోతీనగర్‌, బోరబండలో 3, హైదర్‌ నగర్‌ డివిజన్‌ భాగ్యనగర్‌ కాలనీ, అడ్డగుట్టలో రెండు కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఎప్పటిలాగే ఖైరతాబాద్‌, చార్మినార్‌, సికింద్రాబాద్‌ జోన్లలో పాజిటివ్‌ కేసులొచ్చాయి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.