MLA Zumba Dance: ఫిట్నెస్పై యువత ఆసక్తి పెంచుకోవాలని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. ఏపీలోని విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన జుంబా డే ఈవెంట్ కార్యక్రమానికి... సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తేజాస్ ఎలైట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో.. యువతను ఉత్సాహపరిచేందుకు సంపూర్ణేష్ బాబుతో కలిసి జుంబా డాన్స్ చేశారు. మరిన్ని హెల్త్ ఫిట్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: