ETV Bharat / city

'ఐపీఎస్​లు కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్నారు' - కల్వకుంట్ల ప్రైవేటు సైన్యం

కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టుల సందర్శనకు వెలితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చిన ఇబ్బంది ఏంటని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఏలాంటి లోపాలు లేకుంటే భయమెందుకని నిలదీశారు. ప్రజల పక్షాన తాము చేపడుతున్న కార్యక్రమాలకు అడ్డుతగిలితే ఆగుతామని సీఎం అనుకోవడం పొరపాటేనన్నారు. అవసరమైన మేరకు పార్టీ పరంగా పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

pcc president comments on ips officers they behave like kcr family security
'ఐపీఎస్​లు కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్నారు'
author img

By

Published : Jun 5, 2020, 5:30 AM IST

కరోనా వైరస్‌ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్​డౌన్‌ అమలు సమయంలో మిన్నకుండిన కాంగ్రెస్‌... ఒక్కసారిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు నడుం బిగించింది. వలస కూలీలకు వసతి కల్పించడం, వారి సంక్షేమాన్ని చూడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటున్న కాంగ్రెస్‌... ఇటీవల ఆన్‌లైన్‌ పోరాటానికి పిలుపునిచ్చి అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసింది. ఇదే సమయంలో అధికారంలో ఉన్నప్పడు పనులు చేపట్టి 80శాతానికిపైగా నిర్మాణాలు పూర్తైన ప్రాజెక్టుల విషయంలో... తట్టెడు మట్టి తీయలేదు, పైసా ఖర్చు చేయలేదని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

పాత ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్... పెండింగ్‌ ప్రాజెక్టులను సందర్శించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే దిశలో ముందుకెళ్తోంది. ఈ నెల 2న కృష్ణా నదీపై ఉన్న ప్రాజెక్టుల వద్ద దీక్ష చేసేందుకు నిర్ణయించిన పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. గురువారం నాడు మంజీరా డ్యాం సందర్శనకు వెళ్తున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డిని... పటాన్​చెరు టోల్‌ప్లాజా పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం వైఖరి, ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యవహరిస్తున్న తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. ఒక ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రాజెక్టుల సందర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. వందల మందితో కేసీఆర్​ కొండపోచమ్మ సాగర్​ ప్రారంభోత్సవాలు నిర్వహించగా... తాము తిరిగితే తప్పెలా అవుతుందన్నారు. చట్టాలను దుర్వినియోగం చేస్తూ... ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఐపీఎస్​ అధికారులుగా ఉండి కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంలా పనిచేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ఐపీఎస్​లు ఒకసారి ఆలోచించాలని సూచించారు.

ఇవీచూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.