ETV Bharat / city

Revanth On Drugs Case: కేటీఆర్​ చెప్పడం వల్లనే వారిని వదిలేశారు: రేవంత్​రెడ్డి

Revanth On Drugs Case: తెలంగాణను డ్రగ్స్​ హబ్​గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. బంజారాహిల్స్​ పబ్​లో పట్టుబడిన వారి నుంచి నమూనాలు సేకరించకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. తమకు కావాల్సిన వారు దొరికిపోకుండా ఉండేందుకే అందరినీ వదిలేశారని అన్నారు. పబ్​లో పట్టుబడినవారిన తమ బంధువులు ఉన్నారని ఆరోపిస్తున్నారని.. తనవారి నమూనాలు ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. కేటీఆర్​ శాంపిల్స్​ ఇప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ సిద్ధమా అని రేవంత్​ సవాల్ చేశారు.

pcc president revanth reddy
pcc president revanth reddy
author img

By

Published : Apr 5, 2022, 2:28 PM IST

Updated : Apr 5, 2022, 4:57 PM IST

కేటీఆర్​ చెప్పడం వల్లనే వారిని వదిలేశారు: రేవంత్​రెడ్డి

Revanth On Drugs Case: హైదరాబాద్​ బంజారాహిల్స్​ పబ్​పై టాస్క్​పోర్స్​ దాడి ఘటనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు దాడిచేసిన సమయంలో పబ్​లో సుమారు 142 మంది చిక్కారని.. అయితే వారి నుంచి నమూనాలు సేకరించకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానం తమకుందన్నారు. టాస్క్​పోర్స్​ దాడుల అనంతరం అధికారులకు కేటీఆర్​ ఫోన్​ చేసి చూసిచూడనట్లు వదిలేయమన్నారని రేవంత్​ ఆరోపించారు. అందువల్లనే పబ్​లో పట్టుబడిన వారిని ఎటువంటి నమూనాలు సేకరించకుండా వదిలేశారని విమర్శించారు.

పబ్​లో దొరికిన వాళ్లలో తన బంధువులు ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారని.. ఎవరిమీద అనుమానం ఉంటే వారి నమూనాలు ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు దమ్ముంటే కేటీఆర్​ నమూనాలు ఇప్పించగలరా.. అని సవాల్​ విసిరారు. అసలు డ్రగ్స్​ కేసులో కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసింది తానేనని.. ఫలితంగానే కోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయని రేవంత్​రెడ్డి చెప్పారు. తెలంగాణను డ్రగ్స్​ హబ్​గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని రేవంత్​ ఆరోపించారు. పంజాబ్​లో డ్రగ్స్​ బారినపడి ఎందరో యువత నిర్వీర్యం అయ్యారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే.. పారదర్శకంగా దర్యాప్తు చేయాలని.. విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్​ చేశారు.

'సినీ పరిశ్రమ మీద 2017 వరకు తెరాసకు పట్టులేదు. ఈ డ్రగ్స్​ కేసును అడ్డుపెట్టుకొని ఇండస్ట్రీపై కేటీఆర్​ పట్టుసాధించారు. ఆ పరిచయాలతోనే వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. పబ్​లో పట్టుబడిన వారి శాంపిల్స్​ సేకరించే అవకాశం ఉండి కూడా వదిలేశారు. కేటీఆర్​ ఫోన్​ చేసి చూసిచూడనట్లు వదిలేయమంటే.. ప్రతిపక్షాలు, మీడియాకు తెలిసిందని.. తాము ఏంచేయలేమని ఓ అధికారి కేటీఆర్​కు చెప్పారు. రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడినా వదిలేశారంటే.. మీకు కావాల్సిన వారు ఎవరో ఉన్నారు. అందువల్లనే అందరినీ వదిలేశారు.' - రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

కేసీఆర్‌ సంతకం.. రైతుల పట్ల మరణశాసనం: ధాన్యం కొనలేక తెరాస, భాజపా నాటకమాడుతున్నాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆ రెండు పార్టీలు రాజకీయ రాక్షస క్రీడకు తెరలేపాయని మండిపడ్డారు. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్​ను ఇవ్వబోమని గతంలోనే కేసీఆర్‌ కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారని.. కేసీఆర్‌ సంతకం రైతుల పట్ల మరణశాసనంగా మారిందని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

'రైతులు కష్టపడి పండించిన పంటను కొనే బాధ్యత ప్రభుత్వానిదే. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ చెప్పలేదా?. కేంద్రం మద్దతు ధరను వరికి ప్రకటించిందా? బియ్యానికి ప్రకటించిందా?. కేంద్రం, రాష్ట్రం కలిసి ఏం చేస్తాయో మాకు తెలియదు, వడ్లు మాత్రం కొనాల్సిందే. మిల్లర్లతో కేసీఆర్‌ కుటుంబం కుమ్మక్కయ్యింది. ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముతున్నారు. మిల్లర్లు చాలా తక్కువ ధరకు కొని రైతులను దోపిడీ చేస్తున్నారు. క్వింటాల్‌ రూ.1960కి కొనాల్సిన వడ్లను మిల్లర్లు రూ.1400కే కొంటున్నారు.' - రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీచూడండి:

Last Updated : Apr 5, 2022, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.