ETV Bharat / city

Pawan On Visaka Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణే లక్ష్యంగా.. డిజిటల్ క్యాంపెయిన్: పవన్ - janasena Digital Campaign

Pawan Digital Campaign On Visaka Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా.. ఈనెల 18 నుంచి 20 వరకు డిజిటల్ ప్రచారం చేపట్టాలని జనసేన నిర్ణయించింది. ఈ ప్రచారం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించారు. వైకాపా ఎమెల్యేలు, ఎంపీలు పార్లమెంట్​లో గళమెత్తేలా.. వారి బాధ్యతను గుర్తుచేసేలా ట్యాగ్ చేయాలని పార్టీ శ్రేణులకు పవన్‌ సూచించారు.

విశాఖ ఉక్కు పరిరక్షణే లక్ష్యంగా.. డిజిటల్ క్యాంపెయిన్: పవన్

author img

By

Published : Dec 17, 2021, 7:37 PM IST

Digital Campaign On Visaka Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 18, 19, 20 తేదీల్లో జనసేన తరఫున డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్​ స్పష్టం చేశారు. డిజిటల్ ప్రచారం ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనే విషయాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. వైకాపాకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి కూడా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పకపోగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వారికి తమ బాధ్యతను గుర్తు చేయాలన్న లక్ష్యంతోనే డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మద్దతుగా వైకాపాతో పాటు తెదేపా ఎంపీలు కూడా పార్లమెంట్​లో గళం విప్పాలని పవన్ డిమాండ్‌ చేశారు.

ఎంపీలను ట్యాగ్​ చేయాలి..

డిజిటల్‌ క్యాంపెయిన్‌లో రాష్ట్రానికి చెందిన లోక్​సభ, రాజ్యసభ సభ్యులను ట్యాగ్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంతో పాటు 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే విషయాన్ని పార్లమెంట్​కు తెలిసేలా ఎంపీలను సోషల్ మీడియా ద్వారా కోరాలన్నారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎంపీలకు ట్యాగ్ చేసే డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామన్నారు. ఎంతో మంది బలిదానాలు, త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్​ని కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

ఆ నినాదం ప్రతి ఆంధ్రుడిని కదిలించింది..

జై తెలంగాణ అనగానే తెలంగాణ మొత్తం ఎలా మారుమోగుతుందో అలాంటిదే 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదమన్నారు. ఈ నినాదం ప్రతి ఆంధ్రుడిని కదిలించిందని పవన్ గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాల్సిన సమయమన్నారు. రాజకీయ క్షేత్రంలో పార్టీల మధ్య విబేధాలు ఉన్నా.. ప్రతి పార్టీ అంతిమ లక్ష్యం ప్రజా సేవే అన్నారు. ప్లాంట్​ ప్రైవేటీకరణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినా.., ఇప్పటి వరకూ వారు స్పందించలేదన్నారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.

పార్లమెంట్​లో అడ్డుకోవాలి..

స్టీల్ ప్లాంట్ కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు తాము మర్చిపోమని.., తెలంగాణ జిల్లాలకు చెందిన వారూ విశాఖ ఉక్కు సాధనకు ప్రాణ త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. వైకాపా ఎంపీలు ముందుండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పార్లమెంట్​లో అడ్డుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఎన్నో త్యాగాలతో వచ్చిన పరిశ్రమ కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారంలో పునరాలోచన చేయాలన్న విషయాన్ని కేంద్రానికి తెలపాలన్నారు.

విశాఖ ఉక్కు పరిరక్షణే లక్ష్యంగా.. డిజిటల్ క్యాంపెయిన్: పవన్
విశాఖ ఉక్కు పరిరక్షణే లక్ష్యంగా.. డిజిటల్ క్యాంపెయిన్: పవన్

ఇదీ చదవండి:

CBN On Amaravati Capital: అమరావతి ఏ ఒక్కరిదో కాదు.. ప్రజా రాజధాని: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.