ETV Bharat / city

కానిస్టేబుల్ సమయస్ఫూర్తి+ ప్రజల అప్రమత్తత= యువకుడి ప్రాణం

కానిస్టేబుల్ సమయస్ఫూర్తి... ప్రయాణికుల అప్రమత్తత... ఓ యువకుడి నిండు ప్రాణాన్ని కాపాడాయి. పొరపాటున గోదావరి నదిలో పడిపోయిన ఓ కుర్రాడిని చాకచక్యంగా రక్షించారు.

constable rescued a young man
కానిస్టేబుల్ సమయస్ఫూర్తి+ ప్రజల అప్రమత్తత= యువకుడి ప్రాణం
author img

By

Published : Aug 11, 2020, 1:41 PM IST

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామానికి చెందిన రమేష్... రావులపాలెం పని నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తున్నారు. జొన్నాడ గౌతమి పాత వంతెన వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం లో పెట్రోలు అయిపోయింది. పెట్రోలు తీసుకురమ్మని తండ్రి ఎర్రా రాంబాబుకు ఫోన్ చేశాడు..తండ్రి పెట్రోల్ తెచ్చే లోపు వంతెనపై కూర్చొని ఉన్న రమేశ్ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు.

కొత్త వంతెనపై నుంచి వెళ్తున్న ఆలమూరు హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రావు... రమేశ్​ పడిపోయిన సంగతి చూశాడు. నదిలో పడిన ఆ యువకుడు పక్కనే ఉన్న బ్రిడ్జి స్థంభాన్ని పట్టుకుని కొట్టుకుపోకుండా కాపాడుకున్నాడు. వెంటనే వాహనదారులను అప్రమత్తం చేశాడు కానిస్టేబుల్​ ప్రభాకర్​ రావు. మినీ వ్యాన్​లో ఉన్న తాడును వంతెనపై నుంచి గోదావరిలోకి వేసి యువకుడిని ప్రయాణికులు అంతా కలిసి పైకి లాగారు. సురక్షితంగా పైకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని యువకుడిని ఆసుపత్రికి తరలించారు.

యువకుడు గోదావరిలో పడిన సంఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి . సెల్ఫీ తీసుకుంటుండగా గోదావరిలో పడిపోయాడని కొందరు... పాత బ్రిడ్జి గోడపై కూర్చుని ప్రమాదవశాత్తు పడిపోయాడని మరికొందరు చెబుతున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.