తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తెదేపాలోనే కొనసాగుతానని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. మార్డూరు మండలం దర్శిలో మాట్లాడిన ఆయన.. కొందరు తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మార్పుపై తాను ఎవరినీ సంప్రదించలేదని.. ఆ అవసరం కూడా లేదని అన్నారు. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు.
ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా