ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి దేవీపట్నం మండలం పోచమ్మ గండి మీదుగా పాపికొండలు విహార యాత్ర పునఃప్రారంభమైంది. కచ్చులూరులో జరిగిన పడవ ప్రమాదం తర్వాత పాపికొండలు విహార యాత్ర నిలిచిపోయింది. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఆదివారం నుంచి పర్యాటకుల విహారయాత్ర ప్రారంభమైంది. ఏపీ పర్యాటక శాఖకు చెందిన పడవ.. పర్యాటకులతో ఇవాళ ఉదయం 7 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి 9 గంటలకు పోచమ్మ గండి వద్దకు చేరుకుంది.
మధ్యాహ్నం 1.30 గంటలకు పాపికొండలు చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాణమైన పడవ.. సాయంత్రం 5.30 గంటలకు పోచమ్మ గండికి చేరుకుంది. యాత్రలో ఎలాంటి ప్రమాదం జరగకుండా.. నిపుణులైన డ్రైవర్‌తో పాటు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.
ఇవీచూడండి: TS AP Water War: 'ఏపీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం'