ETV Bharat / city

Papagni bridge collapse Drone video: కడపలో పాపాగ్ని నదిపై కూలిన వంతెన

ఏపీలోని కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న (Papagni bridge collapse 2021) వంతెన కూలింది. కమలాపురం, వల్లూరు మార్గ మధ్యలోని వంతెన అర్ధరాత్రి తర్వాత కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Papagni Bridge Collapsed
Papagni Bridge Collapsed
author img

By

Published : Nov 21, 2021, 11:23 AM IST

Updated : Nov 21, 2021, 1:35 PM IST

ఏపీలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై (papagni bridge collapse 2021) ఉన్న వంతెన కూలింది. కమలాపురం, వల్లూరు మార్గ మధ్యలోని వంతెన అర్ధరాత్రి తర్వాత కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఎత్తేయడంతో భారీగా వరద నీరు వంతెనపై అంచు వరకు రెండు రోజులుగా ప్రవహించడంతో వంతెన బలహీనపడింది. నిన్న సాయంత్రం నుంచి కుంగుతూ వస్తోంది.

కడపలో పాపాగ్ని నదిపై కూలిన వంతెన

ఏడు మీటర్లకు పైగా వంతెన కూలడంతో కిలోమీటర్‌ దూరంలో వాహనాలు నిలిపేశారు. అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారి కావడంతో కడప నుంచి తాడిపత్రి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించడానికి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. వరదలకు పాపాగ్ని వంతెన 10 బ్లాకులు కూలాయని ఈఈ ఓబుల్‌రెడ్డి తెలిపారు. వంతెన కూలడంతో వాహన రాకపోకలు నిలిపేసి.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. రెండ్రోజుల్లో ఉన్నతస్థాయి కమిటీ వంతెనను పరిశీలిస్తుందని పేర్కొన్నారు.

పాపాగ్ని వంతెన డ్రోన్​ వీడియో

నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో...

భారీ వర్షాల కారణంగా పెన్నా నదిలో వరద పోటెత్తుతోంది. దీంతో నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో (Kovur road damaged) 16 నంబరు జాతీయ రహదారి కోతకు గురైంది. నెల్లూరు నగరం దాటాక చెన్నై-కోల్‌కతా మార్గంలో రోడ్డు ధ్వంసమైంది. దీంతో విజయవాడ-నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు తొట్టంబేడు చెక్‌పోస్టు వద్ద నిలిపివేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. మరోవైపు ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరుకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

కోలుకోలేని గాయం

కడప జిల్లాలో జల ప్రళయం (Heavy rains in kadapa) కోలుకోలేని గాయం చేసింది. సుండుపల్లి మండలం పింఛ, రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద ఉన్న అన్నమయ్య జలాశయం మట్టి కట్టలు శుక్రవారం తెగిపోవడంతో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. చెయ్యేరు నదికి పక్కనే ఉన్న పులపుత్తూరు, పులపుత్తూరు ఎస్సీ కాలనీ, కోనరాజుపల్లె, దిగువ, ఎగువ మందపల్లి, శేషమాంబపురం, తోగూరుపేట, గండ్లూరు, చొప్పావారిపల్లె గ్రామాలు ఎక్కువగా నష్టపోయాయి. పాటూరు, ఇసుకపల్లి, నీలిపల్లి, నాగిరెడ్డిపల్లె, నందలూరు, కుమ్మరపల్లి, గొల్లపల్లి, తురకపల్లిలోనూ వర్షపు నీరు ముంచేసింది. ఉదయం 6.30- 8.30 గంటల్లోపు వరద బీభత్సం సృష్టించింది. రెండు గంటల్లోనే ఎక్కడికక్కడే ఇళ్లు కూలిపోయాయి. బాహుదా నది పరివాహక గ్రామాల్లోని ప్రతి ఇంట్లోకి 8-10 అడుగుల మేర నీరు చేరింది. వరద వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు ముందస్తు సమాచారమివ్వలేదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : Tirumala news today : తిరుమల కనుమ రహదారులు పునరుద్ధరణ

Last Updated : Nov 21, 2021, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.