ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొమరిపాలెం మార్కెట్లో విక్రయానికి వచ్చిన ఓ భారీ చేప అందరినీ ఆకట్టుకుంది. సుమారు 300 కిలోల బరువున్న ఆ చేపను 'పండుగప్ప' చేప అంటారు. చేపల వ్యాపారులు పంతాడ విశ్వనాథం, రాజు, విజయ్.. ఈ చేపను విక్రయించేందుకు కొమరిపాలెంలోని చేపల మార్కెట్కు తీసుకొచ్చారు.
భారీ చేప అమ్మకానికి వచ్చిందన్న విషయం అంతా తెలిసి.. దాన్ని చూసేందుకు భారీగా ఎగబడ్డారు. ఇలాంటి చేపలు చిక్కడం చాలా అరుదని మత్స్యకారులు చెప్పారు. సుమారు 30 వేల రూపాయలకు ఈ చేపను విక్రయించినట్లు వ్యాపారులు తెలిపారు.
ఇదీచూడండి: Drunkards attack: మద్యం మత్తులో యువకుల వీరంగం.. రాళ్లతో పరస్పర దాడి