Pandem Kodi Punju Price : సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మొదటగా గుర్తొచ్చేది కోడి పందేలే. పందెంరాయుళ్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కోళ్లను కొందరు పెంపకందార్లు దాదాపు ఏడాదిన్నరగా సిద్ధం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వి.కె.రాయపురంలో దగ్గుమిల్లి మధు పెంచుతున్న పందెం కోళ్ల ధరలను పరిశీలిస్తే వామ్మో.. అనాల్సిందే..! 20 నెలలు వయసున్న రసంగి పందెం కోడి ధర రూ.3.60 లక్షలు పలుకుతోంది. ఈ రకం పుంజు శరీర తత్వం, పోట్లాడే తీరు మిగితా కోళ్ల కంటే భిన్నంగా ఉంటుందని పలువురు పందెంరాయుళ్ల తెలిపారు. పచ్చకాకి రకం కోడి విలువ రూ.2.60 లక్షలు ఉందని పేర్కొన్నారు.
Pandem Kodi Punju Price : ఈ కోడి పుంజు ధర రూ. 3.6 లక్షలు.. ఎందుకంత స్పెషల్? - Pandem Kodi Punju rate
Pandem Kodi Punju Price : పౌరుషానికి ప్రతిరూపాలు పందెంకోళ్లు.. కత్తికట్టి బరిలోకి దించితే.. యజమాని పరువు కోసం.. ప్రాణాలు పణంగా పెట్టి.. కొట్లాడుతాయి. ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు.. 'తగ్గేదే లే'.. అంటూ ప్రత్యర్థిపై విరుచుకుపడతాయి. మరి అలాంటి పందెం కోళ్ల ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం..