ETV Bharat / city

Mogilaiah Kinnera Damage : పవన్​ అభిమానుల తాకిడికి దెబ్బతిన్న మొగిలయ్య కిన్నెర - భీమ్లానాయక్​ ప్రీరిలీజ్​ ఈవెంట్​లో కిన్నెర మొగలయ్యకు చేదు అనుభవం

Mogilaiah Kinnera Damage : 12 మెట్ల కిన్నెర వాద్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు భీమ్లానాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్​లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాయించే కిన్నెర... పవన్ అభిమానుల తాకిడికి స్వల్పంగా దెబ్బతింది.

Mogilalia
Mogilalia
author img

By

Published : Feb 24, 2022, 3:18 PM IST

Mogilaiah Kinnera Damage : పవన్​కల్యాణ్​ భీమ్లానాయక్​ చిత్రం ప్రీరిలీజ్​ ఈవెంట్​ సందర్భంగా... పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు చేదు అనుభవం ఎదురైంది. పవన్​ అభిమానుల తాకిడికి మొగలయ్య చేతిలోని కిన్నెర స్వల్పంగా దెబ్బతింది. బుధవారం భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్​లో పాటపాడి తిరిగి వెళ్తుండగా... మొగలియ్యతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో మొగిలయ్య చేతిలో ఉన్న కిన్నెరలోని భాగాలు ఊడిపోయాయి.

పెద్ద సంఖ్యలో అభిమానులు తనను చుట్టుముట్టడం వల్ల ఏంచేయాలో పాలుపోలేదని, వాళ్లతో మాట్లాడలేక, బయటికి వెళ్లలేక సతమతమయ్యాయని మొగిలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో సజావుగా బయటపడ్డానని తెలిపారు. దెబ్బతిన్న కిన్నెరను బాగుచేసుకుంటున్నట్లు వివరించారు.

త్వరలో మరో చిత్రంలోను..

'ఆడాగాదు.. ఈడాగాదు.. ఆమీరోళ్ల.. మేడాగాదు.... ముత్తులతాతా ఈర్యానాయక్ పెట్టిన పేరు భీమ్లానాయక్' అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్​ కోసం పాట పాడిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్య.. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే చిత్రంలో మరోపాట పాడనున్నారు.

ఇదీ చూడండి : కిన్నెర మొగిలయ్యకు పవన్ ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.