ETV Bharat / city

పశువైద్య రంగంలో సవాళ్లు అధిగమిస్తూ పేదలకు సేవలందించాలి: గవర్నర్ తమిళిసై - గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Governor Tamilisai Sundararajan: దేశంలో పశు వైద్య రంగంలో యువతకు పుష్కలమైన... ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉన్న దృష్ట్యా సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో... పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం జరిగింది. దిల్లీ నుంచి గవర్నర్ వర్చువల్ వేదికగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Governor Tamilisai
Governor Tamilisai
author img

By

Published : Apr 7, 2022, 8:32 PM IST

Governor Tamilisai Sundararajan: పశువైద్య రంగంలో సవాళ్లు అధిగమిస్తూ వెటర్నరీ పట్టభద్రులు గ్రామీణ పేదలకు సేవలందించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్​ రాజేంద్రనగర్​లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో.. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం జరిగింది. దిల్లీ నుంచి గవర్నర్ వర్చువల్ వేదికగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2020-2021 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వెటర్నరీ బీఎస్సీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు 478 మందికి... పట్టాలు ప్రదానం చేశారు. 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు వరించాయి. వీరిలో వెటర్నరీ బీఎస్సీ పట్టభద్రురాలు పొట్లపల్లి స్వేత మూడు బంగారు పతకాలు, పౌల్ట్రీ సైన్స్ బీటెక్ పట్టభద్రుడు నూకల వెంకటరెడ్డి రెండు చొప్పున బంగారు పతకాలు అందుకున్నారు.

'పశువైద్య రంగంలో సవాళ్లు అధిగమిస్తూ వెటర్నరీ పట్టభద్రులు గ్రామీణ పేదలకు సేవలందించాలి. విధి నిర్వహణలో పూర్తి నిబద్ధతతో పని చేయడం ద్వారా రైతుల ఆదరణ పొందాలి. పశు, మత్స్య, కోళ్ల రంగాలతో ఉత్పత్తి, సంక్షేమం, ఆహార భద్రత, ప్రజా ఆరోగ్యం ఆధారపడి ఉన్నందున గ్రామీణాభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై ఆ రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మానవాళి ఆరోగ్యంలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తున్న దృష్ట్యా పశువుల ఆరోగ్యం బాగుండాలని... అందుకు అనుగుణంగా తరచూ సోకే రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పశువైద్యులు కృషి చేయాలి. కొవిడ్ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడం, కొత్తకొత్త వాణిజ్య పంటలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో దేశీయంగా అభివృద్ధి చేసిన పశు జాతుల రకాలను శాస్త్రవేత్తలు ప్రాచుర్యంలోకి తీసుకురావాలి.'

-గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

'రెండు గోల్డ్ మెడల్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతోనే ఈ మెడల్స్ సాధించాను. ప్రస్తుతం ఫౌల్ట్రీ సైన్స్​లో పీజీ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు డాక్టర్ మహిపాల్​రెడ్డి, సీవీ రెడ్డి అనే రెండు గోల్డ్​ మెడల్స్ ఫౌల్ట్రీ సైన్స్ విభాగంలో వచ్చాయి. నా చిన్నప్పటి నుంచి ఈ కోర్సు చేయాలని ఉండేది. ఇప్పుడు అది సాకారం అయ్యింది.'

-వెంకట్‌ రెడ్డి గోల్డ్‌ మెడల్‌ సాధించిన పట్టభద్రుడు, నల్గొండ జిల్లా

'నాకు దిశా గోల్డ్ మెడల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళలలో ధైర్యం నింపడం కోసం అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సు పెట్టి ప్రోత్సహించారు. అందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నాకు ఈ గోల్డ్ మెడల్ వచ్చింది. జంతువులకు సేవ చేయడం చాలా అదృష్టంగా భావించాలి. పశువులకు ట్రీట్​మెంట్ ఇవ్వాలంటే చాలా ధైర్యం ఉండాలి. భవిష్యత్తులో మంచి పశువైద్యాధికారి కావడమే నా లక్ష్యం. జంతువులు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం.'

-నవ్యశ్రీ గోల్డ్ మెడల్ సాధించిన పట్టభద్రురాలు, గద్వాల జిల్లా

ఈ కార్యక్రమానికి ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. భూపేంద్రనాధ్ త్రిపాఠి, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఉపకులపతి డా. వి.రవీందర్​రెడ్డి, రిజిస్ట్రార్ వీరోజిరావు, తదితరులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:ఒక మహిళను గౌరవించే విధానం ఇదేనా..? : గవర్నర్ తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.