ETV Bharat / city

దాతల విరాళాల్లేవ్.. పోషణ భారమైంది! - ఆర్థిక ఇబ్బందుల్లో అనాథాశ్రమాలు

కరోనా వైరస్​ ప్రపంచమంతటినీ కుదిపేసింది. అన్ని వ్యవస్థలు కొంతకాలం పాటు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో అందరూ.. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటిస్తున్నారు. ఆశ్రమాల పరిస్థితి అయితే మరీ దారుణం. కేవలం దాతల సహాయంతో నడిచే అనాథాశ్రమాలు విరాళాలు తగ్గిపోయి.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిర్వహణ భారమై.. శరణార్థులను పోషించలేక.. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.

Orphan Homes facing troubles With financial Problems
దాతల విరాళాల్లేవ్.. పోషణ భారమైంది!
author img

By

Published : Sep 12, 2020, 8:33 AM IST

హైదరాబాద్ నగరంలో దాదాపు 250 వరకు అనాథశ్రమాలున్నాయి. ఒక్కో ఆశ్రమంలో 30 నుంచి 60 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. మొత్తం అన్ని ఆశ్రమాల్లో కలిపి 15 వేలమంది శరణార్థులు ఉంటారు. లాక్​డౌన్ సమయంలో అనాథాశ్రమాల్లోని చాలామంది పిల్లలు వారి సంరక్షకుల దగ్గరికి వెళ్లిపోగా.. ఎవరూ లేని నిస్సహాయులు మాత్రం అనాథశ్రమాల్లోనే ఉండిపోయారు. కరోనా పరిస్థితుల్లో అందరికీ ఆదాయం తగ్గిపోవడం, ఆర్థిక వ్యవస్థ కుంటుపడడం కారణంగా దాతలు సైతం విరాళాల విషయంలో కోత విధించుకున్నారు. ఈ దెబ్బకు ఒక్కసారిగా ఆశ్రమాలకు విరాళాలు తగ్గిపోయాయి. నిరంతరంగా విరాళాలు అందించే దాతలు సైతం.. ఈ కాలంలో పొదుపు పాటిస్తున్నారు. దీంతో ఆశ్రమాల నిర్వహణ భారంగా మారింది. పిల్లలు, వృద్ధుల పోషణ, వైద్యఖర్చులు భారంగా మారిన ఆశ్రమ నిర్వాహకులు ఇంటి అద్దెలు, సిబ్బంది జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.

లాక్​డౌన్​కు ముందు హోమ్​లలో పిల్లల చదువును భరించేందుకు ప్రైవేటు పాఠశాలలు, దాతలు ముందుకొచ్చేవారు. ఇప్పుడు పాఠశాలలకు సైతం నిర్వహణ ఖర్చులు భరించలేక అనాథపిల్లలకు ఆన్​లైన్ చదువులు అందించేందుకు సముఖత చూపట్లేదు. నగరంలోని వాత్సల్యం, స్ఫూర్తి, ఆరాధన వంటి 200కు పైగా ఆశ్రమాలు.. అనాథ పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తున్నాయి. ఇవన్నీ కేవలం విరాళాల మీదే ఆధారపడి పనిచేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విరాళాలు తగ్గిపోవడం, దాతలు ముందుకు రాకపోవడం వల్ల ఆశ్రమ నిర్వహణ భారాలు మోయలేక ప్రభుత్వ సహాయం కోసం అభ్యర్థిస్తున్నాయి. ఆశ్రమాల్లో ఉన్న పిల్లలను.. తిరిగి వారి సంరక్షకులకు అప్పగించింది. ఏ దిక్కు లేని కొంతమందికి మాత్రం అంగన్​వాడిల ద్వారా పోషణ, సంరక్షకుల ద్వారా వారి బాధ్యతను ప్రభుత్వమే చూస్తోంది. చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు బంధువుల ఇళ్లలో ఉన్న పిల్లల చిరునామా, ఫోన్ నంబర్లు తీసుకొని ఎప్పటికప్పుడు వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. నా అనే దిక్కు లేని అభాగ్యులు మాత్రం ఆశ్రమాల్లోనే ఉండిపోయారు. వారి సంరక్షణ, బాగోగులు భారమై.. నిర్వాహకులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి: రక్షణ రంగంలో భారత్​- జపాన్​ కీలక ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.