ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా అరకు ప్రాంతంలోని చల్లని వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్గానిక్ స్ట్రాబెర్రీని పండిస్తున్నారు. స్ట్రాబెర్రీ సాగుతో ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతున్నారు. అరకు సందర్శనకు వచ్చే పర్యటకులు ఈ స్ట్రాబర్రీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. స్థానిక నగరం విశాఖ సహా విజయవాడ వంటి ప్రాంతాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. స్ట్రాబెర్రీని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి : 'ఈ ఏడాది "మహిళా రక్షణ- రోడ్డు భద్రతా సంవత్సరం