రాష్ట్రంలోని మహిళలు, పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతకు ఈ ఏడాది అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాదిని మహిళా రక్షణ-రోడ్డు భద్రత సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పోలీస్ ఉన్నతాధికారులు, డీజీపీ కార్యాలయ సిబ్బంది మధ్య కేక్ కట్ చేశారు.
రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు పోలీస్ శాఖ తమవంతు కృషి చేస్తుందని మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ఈచ్ వన్-టీచ్ వన్' కార్యక్రమంలో చిత్తశుద్దితో పాల్గొని, ఒకొక్క పోలీసు యూనిట్ కనీసం తమ పరిధిలోని 20మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. మానవ జన్మకు సార్థకత చేకూరాలంటే తన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచాలని డీజీపీ పేర్కొన్నారు.
ఇవీ చూడండి : రూట్ల ప్రైవేటీకరణకు కేంద్రం రైట్ రైట్?