ETV Bharat / city

మురికికాలువ విషయంలో వివాదం.. ఇరువర్గాల ఘర్షణ - నెల్లూరు జిల్లా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అరుంధతిపాలెంలో మురికికాలువ విషయంలో చెలరేగిన వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గొడవను సర్ధుబాటు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా.. వారి ముందే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

opposite-houses-people-fight-each-other-with-drainage-issue-in-nellore-dist-atmakuru
మురికికాలువ విషయంలో వివాదం.. ఇరువర్గాల ఘర్షణ
author img

By

Published : Aug 12, 2020, 10:14 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో మురికికాలువ విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఒకరిపై ఒకరి దాడికి దారితీసింది. అరుంధతిపాలెంలో 2 రోజుల క్రితం మురికికాలువ విషయంలో ఎదురెదురు ఇళ్ల వారి మధ్య చిన్న వివాదం ఏర్పడింది. ఈ విషయమై రెండు వర్గాలు పోలీసు స్టేషన్ ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీసులు వారి మధ్య సయోధ్య కుదిర్చి ఇళ్లకు పంపారు. అదే విషయమై ఇరువర్గాలు తిరిగి గొడవపడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు.

అటుగా వెళ్తున్న పోలీసులు గొడవను సర్దుబాటుచేసేందుకు ప్రయత్నించగా...మాటమాట పెరిగి వివాదం మరింత ముదిరింది. పోలీసుల ఎదుటే బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.49 శాతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.