ETV Bharat / city

తెదేపా నేతల పొలాలకు నిప్పు.. మండిపడ్డ అచ్చెన్నాయుడు - చిత్తూరులో తెదేపా నేతల పొలాలకు నిప్పు

Opponents sets Fire to farm fields: వైకాపా నేతలు ఫ్యాక్షన్‌ దాహంతో పచ్చని పొలాలనూ వదలట్లేదని.. తెదేపా నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీలోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం దిగువశితివారిపల్లిలో.. తెదేపా నేతల పొలాలకు కొందరు నిప్పుపెట్టిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.

Opponents sets Fire to farm fields
తెదేపా నేతల పొలాలకు నిప్పు
author img

By

Published : Mar 18, 2022, 2:31 PM IST

Opponents sets Fire to farm fields: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం దిగువశితివారిపల్లిలో.. తెదేపా నేతల పొలాలకు కొందరు నిప్పుపెట్టిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కురబలకోట మాజీ మండల అధ్యక్షుడు, తెలుగుదేశం నేత భూమిరెడ్డి, ఆయన తమ్ముడు చంద్రశేఖర్‌రెడ్డి పొలాలకు దుండగులు నిప్పు పెట్టగా తగలబడిపోయాయి. మంటల్లో టమాటా పంటకు ఆసరాగా పెట్టే కర్రలతో పాటు.. బిందుసేద్యం పరికరాలు దగ్ధమయ్యాయి.

తెదేపా నేతల పొలాలకు నిప్పు

విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. సర్పంచ్‌ ఎన్నికల్లో తమ వర్గానికి చెందిన వ్యక్తి గెలుపొందడంతో.. వైకాపా నేతలు కక్షగట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా నేత శంకర్‌రెడ్డే తమ పొలాలకు నిప్పుపెట్టాడని.. అధికార బలంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అచ్చెన్నాయుడు ఆగ్రహం..

ఈ ఘటనపై స్పందించిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. వైకాపా నేతలు ఫ్యాక్షన్‌ దాహంతో పచ్చని పొలాలనూ వదలట్లేదని మండిపడ్డారు. జగన్ తన ఫ్యాక్షన్‌ సంస్కృతిని రాష్ట్రమంతా ఎక్కిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేక.. దొంగ దెబ్బ తీయడం సిగ్గుచేటంటూ విమర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి: దక్షిణాదిపై ఆప్ దృష్టి.. ఆరోజు నుంచే తెలంగాణలో కేజ్రీవాల్‌ పాదయాత్ర..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.