ETV Bharat / city

స్వదేశానికి రప్పించేందుకు ఆపరేషన్ "సముద్ర సేతు" - భారత పౌరుల తరలింపునకు ఆపరేషన్ "సముద్ర సేతు"

భారత నావికాదళం ఆపరేషన్ "సముద్ర సేతు" ను ప్రారంభించింది. భారతీయ పౌరులను విదేశాల నుంచి స్వదేశానికి రప్పించే ప్రయత్నంలో భాగంగా.. తొలి దశలో రేపటి నుంచి ఈ తరలింపు ప్రక్రియను చేపడుతోంది. భారత నావికాదళ నౌకలు జలాశ్వ, మాగర్... మాల్దీ, రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవుల ఓడరేవుల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నాయి.

స్వదేశానికి రప్పించేందుకు ఆపరేషన్ "సముద్ర సేతు"

author img

By

Published : May 7, 2020, 12:02 AM IST

విదేశాల్లో ఉన్న మన పౌరులపై కొవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. సముద్ర మార్గం ద్వారా వారిని స్వదేశానికి తరలించడానికి తగిన సన్నాహాలు చేయాలని భారత నావికాదళాన్ని ఇప్పటికే ఆదేశించింది. ఈ ప్రక్రియను ఆపరేషన్ "సముద్ర సేతు"గా ప్రారంభించింది. రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవుల్లోని ఇండియన్ మిషన్ నావికాదళ ఓడల ద్వారా తరలించాల్సిన భారతీయ పౌరుల జాబితాను సిద్ధం చేసింది.

వైద్య పరీక్షల అనంతరం వీరిని ప్రయాణానికి అనుమతిస్తారు. మొదటి దశలో మొత్తం 1000 మందిని తరలించాలని నిర్ణయించారు. భౌతిక దూరం నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటారు. ఈ ఆపరేషన్ కోసం నౌకలను తగిన రీతిలో సిద్ధం చేశారు. మార్గం మధ్యలో ప్రాథమిక సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, ఆహార వసతి కల్పిస్తారు. భారతీయులను క్షేమంగా దేశానికి చేర్చేలా ప్రణాళికలను సిద్ధం చేశారు.

ఇవీ చూడండి : మహారాష్ట్రలో ఒక్కరోజే 1200 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.