ETV Bharat / city

సైన్స్ పరిశోధనల కేంద్రంలో ఓపెన్ డే

author img

By

Published : Sep 26, 2019, 11:36 PM IST

సీసీఎంబీ.... సైన్స్ పరిశోధనల కేంద్రంగా ప్రజలందరికీ సుపరిచితమే అయినా... దాన్ని సందర్శించే అవకాశం రావటం మాత్రం అత్యంత అరుదనే చెప్పాలి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్(సీఎస్​ఐఆర్​) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ప్రజల సందర్శనకు అనుమతిస్తూ సీసీఎంబీ ఓపెన్ డే కార్యక్రమాన్ని నిర్వహించింది.

సీసీఎంబీలో ఓపెన్ డే... సందర్శనకు అనుమతి
సీసీఎంబీలో ఓపెన్ డే... సందర్శనకు అనుమతి

సెప్టెంబర్ 26న సీఎస్​ఐఆర్​ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా సీసీఎంబీలో ఓపెన్ డే నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రదర్శనలో పరిశోధనల గురించిన అంశాలను సీసీఎంబీ పరిశోధనా విద్యార్థులు సందర్శనార్థం ఉంచారు. వివిధ రకాల చిత్రాలు, నమూనాలు, కంప్యూటర్ త్రీడీ టెక్నాలజీతో వివరించారు. సుమారు 15,000 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించి..... శాస్త్ర సాంకేతిక రంగంలో సీసీఎంబీ సాధిస్తున్న విజయాలతోపాటు.. వివిధ రకాల పరిశోధనలు వాటి ఫలితాలను చిట్టి బుర్రలోకి ఎక్కించుకున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.