రాష్ట్రాలు, దేశాల రాజధానులు అడిగితే.. అవలీలగా సమాధానం చెప్పేస్తుంది.. జ్ఞానసాయి. ఏపీలో ఒంగోలులోని కమ్మపాలేనికి చెందిన చక్రవర్తి, దీప్తిల రెండో కుమార్తె. వయసు మూడేళ్ల రెండు నెలలు. ఇప్పుడిప్పుడే చిలుక పలుకులు పలికే చిరుప్రాయమది. అలాంటిది.. తనకున్న ప్రతిభతో రాజధానుల పేర్లు, రైమ్స్, తెలుగు పద్యాలు గడగడా చెప్పేస్తోంది.
పాప పేరును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు తల్లిదండ్రులు పంపగా.. ఆ జ్యూరీ ఆన్‌లైన్ ద్వారా పెట్టిన పరీక్షను జ్ఞానసాయి నెగ్గింది. వారి ప్రశంసలను, ధ్రువపత్రాన్ని పొందింది. ఏదైనా చెబితే వెంటనే తిరిగి అప్పజెప్పే చలాకీతనం చూసి ఆమెకు తర్ఫీదునిచ్చామని తల్లిదండ్రులు అంటున్నారు. చిన్నారి మరిన్ని అద్భుతాలు చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: ఇదొక సూపర్ స్పెషల్ బీర్- ధర రూ.60!