ETV Bharat / city

వెయ్యి కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. వెల్లడించిన కాగ్ నివేదిక - illegal land occupation in telangana

తెలంగాణలోని ఎనిమిది జిల్లాల పరిధిలో దాదాపు వేయి కోట్ల రూపాయల విలువైన భూమి ఆక్రమణకు గురైందని కాగ్ తెలిపింది. వేల ఎకరాల దేవాదాయ భూములు కూడా కబ్జాలో ఉన్నాయని వెల్లడించింది.

land grabbing, land occupied
ప్రభుత్వ భూమి కబ్జా
author img

By

Published : Mar 27, 2021, 10:18 AM IST

రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలో రూ. వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణల పాలైందని కాగ్‌ పేర్కొంది. వీటి పరిరక్షణలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) విఫలమయ్యారని, కొన్ని రిజిస్టర్లు కూడా అందుబాటులో లేవని తెలిపింది. వేల ఎకరాల దేవాదాయ భూములు కూడా కబ్జాలో ఉన్నాయని నివేదికలో వెల్లడించింది. వాటిలో కొన్ని అంశాలు...

  • రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని 24 మండలాల పరిధిలో 322 గ్రామాల్లో రూ.1096.45 కోట్ల విలువైన 12,666.25 ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నాయి.
  • జిల్లా కలెక్టర్‌, టీఎస్‌ఎల్‌ఎంఏ సిఫార్సు ధరలను పక్కనపెట్టి రెండు ప్రైవేటు సంస్థలకు రూ.117.40 కోట్ల అనుచిత లబ్ధి చేకూర్చారు. ఎకరాకు రూ.1.50 లక్షల చొప్పున 20 ఎకరాల ప్రభుత్వ భూమిని 2006 సెప్టెంబరులో సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ ఉన్నత పాఠశాలకు కేటాయించారు. వడ్డీతోపాటు ఆ సంస్థ నుంచి వసూలు చేయాలని న్యాయస్థానాలు ఆదేశించినా, దాని రికార్డులు సీసీఎల్‌ఏ కార్యాలయంలో లేవు.
  • భూమి మూల విలువ ఎకరం రూ.3.87 కోట్లు ఉండగా ఎకరాకు ఒక్క రూపాయి చొప్పున 15 ఎకరాలను మెసర్స్‌ రాజా బహదూర్‌ వెంకటరామ రెడ్డి విద్యాసంస్థకు బదిలీ చేసి, రూ.58.05 కోట్ల అనుచిత లబ్ధి చేకూర్చారు.
  • సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో రూ.708.53 కోట్ల విలువైన 1.67 లక్షల చ.గ. ప్రభుత్వ భూమిని కొందరు కౌలుపేరుతో అనుభవిస్తున్నారు. దీని వివరాలు కోరగా సీసీఎల్‌ఏ నుంచి నిర్దిష్ట సమాధానం లేదు.
  • దేవాదాయ శాఖ పరిధిలో 87,235.39 ఎకరాల భూమి ఉంటే 59,896.32 ఎకరాలకు పాసుపుస్తకాలు తీసుకోలేదు. తొమ్మిది దేవాయాలకు చెందిన రూ.311 కోట్ల విలువైన 6,343.12 ఎకరాలు ఆక్రమణల పాలైంది. శాఖ దస్త్రాలను పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 20,124 ఎకరాల భూమి ఆక్రమణల్లో ఉంది.
  • రెవెన్యూ అధికారులు నిషేధిత ఆస్తుల జాబితాను నవీకరించి రిజిస్ట్రేషన్ల శాఖకు తెలపకపోవడం వల్ల పలు జిల్లాల్లో రూ.145.20 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు అమ్మేశారు.

నాణ్యత పరీక్షలు లేకుండానే చెల్లింపులు

  • ‘ప్రతి జిల్లాలో అభివృద్ధి పనుల నాణ్యతను పరీక్షించకుండానే నిధులు చెల్లించేస్తున్నారు...చెల్లింపులు పూర్తయిన తరువాత వినియోగ ధ్రువీకరణ పత్రాన్ని (యూసీ) జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి (సీపీవో) ఆన్‌లైన్‌లో పెట్టడం లేదు. దీనివల్ల వివరాలు ప్రభుత్వానికి తెలియడం లేదు’ అని కాగ్‌ నివేదిక వెల్లడింది. భద్రాద్రి జిల్లాలో 14 పనులను తనిఖీ చేస్తే సగానికి సగం పనుల వివరాలు సీపీవో ఇచ్చిన వివరాలకన్నా భిన్నంగా ఉన్నట్లు తేలింది. దీనిపై వివరణ అడిగితే పనులు చేసిన సంస్థలు వివరాలివ్వలేదంటూ సీపీవో సమాధానమిచ్చారని కాగ్‌ తెలిపింది.
  • చెల్లించిన నిధులకు 60 శాతం యూసీలే లేవు. కొన్ని జిల్లాల నిధుల్లో 36 శాతం సీపీఓల వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాల్లో ఉన్నాయి. ఇలా మిగిలిన నిధులపై నిఘాకు ప్రత్యేక యంత్రాంగం అవసరం.

ప్రాజెక్టుల జాప్యంతో ఆర్థిక భారం

  • రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం వల్ల ఆర్థికభారం పెరుగుతోందని కాగ్‌ పేర్కొంది. డిండి జలాశయం నిర్మాణంలో ఆరేళ్ల జాప్యం, రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌, దుమ్ముగూడెం-సాగార్జునసాగర్‌ సుజల స్రవంతి పథకాలకు ముందస్తు చెల్లింపులు, కాళేశ్వరం ప్యాకేజీలు 10, 12లలో సేవా పన్ను మళ్లింపు తదితర అంశాలను సమీక్షించింది.
  • 2005లో చేపట్టిన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పరిధిలోని డిండి బ్యాలెన్సింగ్‌ జలాశయం డిజైన్లలో వచ్చిన తేడాలు ఆలస్యానికి కారణమయ్యాయి. ఈపీసీ ఒప్పందాల నిర్వహణకు నీటిపారుదలశాఖలో తగిన సాంకేతిక సమర్థత లేకపోవడం ఆరేళ్ల జాప్యానికి కారణమైంది. నిర్మాణానికి అదనంగా రూ.76.86 కోట్లు విడుదల చేయాల్సి వచ్చింది.
  • 2007లో అనుమతి ఇచ్చిన రాజీవ్‌సాగర్‌ దుమ్ముగూడెం ఎత్తిపోతలు, ఇందిరాసాగర్‌ దుమ్ముగూడెం ఎత్తిపోతలకు రూ.7.59 కోట్లు, జ్యోతిరావు ఫులే దుమ్ముగూడెం నాగార్జున సాగర్‌ సుజల స్రవంతి పథకం నిధులు రూ.276.56 కోట్లను అప్పటి ప్రభుత్వం ముందస్తు చెల్లింపుల కింద మంజూరు చేసింది.
  • 2014 తరువాత తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాలను రద్దు చేసి ఒకటిగా పునరాకృతి చేపట్టింది. ముందస్తు చెల్లింపుల మొత్తం వడ్డీతో కలిపి రూ.428.98 కోట్లకు చేరింది. ఆ సొమ్మును గుత్తేదారుల నుంచి తిరిగి వసూలు చేయడంలో నీటిపారుదల శాఖ విఫలమైంది.

సేవా పన్నును తిరిగి ఇచ్చి అనుచిత లబ్ధి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నుంచి పునరాకృతిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 10, 12 ప్యాకేజీల్లో గుత్తేదారులు చెల్లించిన సేవా పన్ను రూ.31.69 కోట్లను అధికారులు తిరిగి వారికే ఇచ్చేశారు. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి జమ చేయకుండా పబ్లిక్‌ వర్క్స్‌ పద్దులో ఉంచడం, గుత్తేదారులకు చెల్లించడం తప్పిదాలే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.