ETV Bharat / city

Record Level Liquor Sales: మద్యం అమ్మకాల్లో అక్టోబరు నెల ఆల్‌టైం రికార్డు.. ఎంతంటే?

మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైం రికార్డు (Record Level Liquor Sales) సృష్టించింది. దసరా పండుగ (dasara festival), హుజూరాబాద్ ఉప ఎన్నికలు (huzurabad bypoll) జరగడంతో అక్టోబర్ నెలలో ఏకంగా రూ.2,653 కోట్లు విలువైన మద్యం (Liquor Sales) అమ్ముడు పోయింది. లిక్కర్ అమ్మకాల కంటే బీర్ల విక్రయాలు ఎక్కువ జరిగాయి.

Record Level Liquor Sales
Record Level Liquor Sales
author img

By

Published : Nov 4, 2021, 9:43 AM IST

అక్టోబర్ నెలలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైమ్ రికార్డ్(Record Level Liquor Sales in telangana) సృష్టించింది. మునుపెన్నడూ లేని రీతిలో అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్క నెలలోనే ఏకంగా రూ.2,653 కోట్ల విలువైన మద్యం (Liquor Sales) అమ్ముడు పోయింది. ఏటా దసరా పండుగ సమయంలో మద్యం విక్రయాలు సాధారణం కంటే కొంచం ఎక్కువ ఉంటాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలు సైతం (huzurabad bypoll) అదే నెలలో ఉండడం వల్ల మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి.

ఈసారి అదనపు రాబడి

గత ఏడాది ఇదే నెలలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే రూ.30 కోట్లు విలువైన మద్యం ఎక్కువ. 2019తో పోలిస్తే ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా రాబడి వచ్చింది. గత అక్టోబర్​తో పోలిస్తే ఈసారి అక్టోబర్​లో బీర్లు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది లాక్​డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కూడా హైదరాబాద్​లో వసతి గృహాలు మూతపడటం, సాఫ్ట్​వేర్ ఉద్యోగులు గ్రామాలకే పరిమితం కావడం లాంటి కారణాలతో 2020 అక్టోబర్ నెలలో బీర్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. ఆ నెలలో కేవలం 26.93 లక్షల కేసులు బీర్లు మాత్రమే అమ్ముడు పోయాయి. 2019 సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 11 లక్షల కేసుల వరకు తక్కువ. 2021 అక్టోబర్​లో మాత్రం 31.43లక్షల కేసులు బీరు విక్రయాలు జరిగి ఏకంగా లిక్కర్ అమ్మకాలను మించిపోయాయి.

ఆ జిల్లాల్లో ఎక్కువ విక్రయం

సాధారణంగా ప్రతిరోజూ సగటున 60 నుంచి 90 కోట్ల విలువైన మద్యం రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అవుతుంది. అయితే అక్టోబర్ నెలలో దసరా పండగ సమయంలో… సరఫరా గణనీయంగా పెరిగింది. దసరా ముందు రోజుల్లో అంటే అక్టోబర్ 12న రూ.141 కోట్లు, 13న రూ.157.64 కోట్లు, 14వ తేదీన రూ.178.17 కోట్ల మద్యం డిపో నుంచి దుకాణాలకు తరలింది. అక్టోబర్ నెలలో జరిగిన మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికం. వికారాబాద్​లో అత్యల్పంగా మద్యం అమ్ముడుపోయింది. కరీంనగర్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోకి వచ్చే హుజూరాబాద్​ ఉప ఎన్నికలు జరగడంతో ఆ జిల్లాలో గత ఏడాది కంటే ఎక్కువ విక్రయాలు జరిగాయి. గత ఏడాది అక్టోబర్​లో ఆ జిల్లాల్లో 188.14 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోయింది. ఈసారి రూ.192.53 కోట్లు విలువైన అమ్మకాలు జరిగాయి.

ఇదీ చూడండి: Liquor Sales in Huzurabad : అక్కడ మద్యం ఏరులై పారుతోంది.. భారీగా పెరిగిన అమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.