గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలు జల దిగ్బంధం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో పలు వరద ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ తన సేవలను అందిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్పర్సన్ నారా భువనేశ్వరి ఆదేశాలతో వరద ప్రాంతాల్లో ట్రస్ట్ సహాయక చర్యలు(NTR Trust Services at floods effected areas) కొనసాగుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరదలతో నిరాశ్రయులైన ప్రజానీకానికి తాగునీరు, ఇతర ఆహార పదార్థాలను ఎన్టీఆర్ ట్రస్ట్ అందజేస్తోంది.
గత ఐదు రోజులుగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్రస్ట్ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ.. వాళ్లు తమ ఉదారతను చాటుకుంటున్నారు.
ఇదీ చదవండి: TSRTC Single Day Income: ఒక్కరోజే టీఎస్ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రాబడి.. ఎంతంటే?