ETV Bharat / city

భూముల విక్రయానికి సర్కారు ప్రకటన.. జూలై 15న ఈ-వేలం - land sales notification

notification for land sales in telangana

author img

By

Published : Jun 12, 2021, 9:22 AM IST

07:28 June 12

ప్రభుత్వ భూముల విక్రయానికి నోటిఫికేషన్​.. జూలై 15న ఈ-వేలం

నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ భూములు అమ్మాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అమ్మకానికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు... తాజాగా భూముల విక్రయానికి ప్రకటన జారీ చేసింది. మొదటి దశలో హెచ్ఎండీఏకు చెందిన కోకాపేట భూములతో పాటు ఖానామెట్ భూములను అమ్మనున్నారు. కోకాపేటలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన నియో పోలిస్ లేఅవుట్​లోని ఏడు ప్లాట్లతో పాటు గోల్డెన్​మైల్ లేఅవుట్​లోని ఒక ప్లాట్ ఉంది. 

49.92 ఎకరాల విస్తీర్ణంలోని కోకాపేటలోని ప్లాట్లు, ఖానామెట్​లో టీఎస్ఐఐసీకి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. మొత్తం 64.93 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను వేలం వేయనున్నారు. ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనుండగా... 25న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తారు. జూలై 13 రిజిస్ట్రేషన్​కు చివరి తేదీ కాగా... జూలై 15న ఈ -వేలం నిర్వహిస్తారు. కోకాపేట భూముల వేలం ప్రక్రియను హెచ్ఎండీఏ, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను టీఎస్ఐఐసీ నిర్వహించనుంది.

ఇదీ చూడండి: CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.