ETV Bharat / city

నోటీసు లిస్తారా.. తొలగిస్తారా..? తేల్చుకోండి..!

ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. దీనిపై కార్మిక సంఘాలు వెనక్కి తగ్గడం లేదు.. ఆర్టీసీ పరిరక్షణ కోసం మొదలుపెట్టిన సమ్మె..... ప్రజాస్వామ్య పోరాటంగా రూపాంతరం చెందిందని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. ఇవాళ బస్సు డిపోల ఎదుట జమ్మి పూజ నిర్వహించి నిరసన వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు.

నోటిసు లిస్తారా..తొలగిస్తారా..? తేల్చుకోండి..!
author img

By

Published : Oct 8, 2019, 4:50 AM IST

Updated : Oct 8, 2019, 6:27 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించింది. తమ సమస్యలు పరిష్కరిస్తే తప్ప కార్మిక సంఘాలు సమ్మె బాట వీడమని స్పష్టం చేశాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని ఐకాస నేతలు పేర్కొన్నారు.

నోటిసు లిస్తారా..తొలగిస్తారా..? తేల్చుకోండి..!

ఇవాళ డిపోల ఎదుట జమ్మి పూజలు
తాము చేపట్టిన సమ్మెతో ప్రభుత్వంలో చలనం మొదలైందని... ముఖ్యమంత్రి అసహనంతో మాట్లాడుతున్నారని ఐకాస నేతలు విమర్శించారు. కార్మికులు ఎట్టిపరిస్థితుల్లో అధైర్యపడొద్దని కార్మికులకు సూచించారు. సమ్మెపై వెనక్కి తగ్గమని... ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు సీఎం యత్నిస్తున్నారని ఆరోపించారు. పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. దసరా సందర్భంగా డిపోల ఎదుట జమ్మి పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఆర్టీసీ సమ్మె@ ప్రజాస్వామ్య పోరాటం

హైదరాబాద్‌ గన్​పార్కు వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన కార్మిక ఐకాస నేతలను పోలీసులు స్టేషన్​కు తరలించారు. ధర్నా చేపట్టేందుకు అనుమతి లేదని అదుపులోకి తీసుకుని కాసేపటికే వదలిపెట్టారు. విడుదల అయిన తర్వాత ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయానికి వచ్చిన ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 48వేల మంది కార్మికులకు షోకాజ్ నోటీసు పంపుతారో? తొలగిస్తారో? తేల్చుకోవాలని ప్రభుత్వానికి సవాల్​ విసిరారు.

సమ్మెపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు: ఐకాస
కేసీఆర్​ నియంతృత్వ వైఖరి మారాలని ఆర్టీసీ ఐకాస-1 నేతలు విమర్శించారు. సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్ష చేస్తామని ఐకాస నేతలు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఐకాస తీర్మానించింది. ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినా సమ్మెపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఐకాస నేతలు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: "ఆర్టీసీని ప్రైవేటీకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు"

Intro:Body:Conclusion:
Last Updated : Oct 8, 2019, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.