ETV Bharat / city

వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం రూపొందించిన యాప్​లో పట్టణాలు, పల్లెల్లో ఇళ్లు, దుకాణాల వంటి నిర్మాణాల వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఖాళీ ప్లాట్ల వివరాల ప్రస్తావన మాత్రం ఇంకా లేదు. వివరాలు నమోదు చేసేవారికి... ఒక్కో ఆస్తి నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు రూపాయలు ప్రోత్సాహకంగా ప్రకటించింది.

non agriculture properties enroll process speed up
వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ వేగవంతం
author img

By

Published : Oct 4, 2020, 1:45 PM IST

వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ వేగవంతం

దసరా నుంచి ధరణి ప్రారంభం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. పక్షం రోజుల గడువు పూర్తి కావస్తోన్నందున ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆస్తుల వివరాలు యాప్​లో నమోదు చేస్తున్నారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖ వద్ద ఉన్న ఆస్తిపన్ను సంఖ్య, ఇతర వివరాల ఆధారంగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రత్యేకించి యజమాని ఆధార్ సంఖ్య, కుటుంబసభ్యుల వివరాలు తీసుకుంటున్నారు. కుటుంబసభ్యుల తెలిపిన సమాచారాన్ని స్వీయధ్రువీకరణగా పరిగణిస్తున్నారు.

స్వచ్ఛందంగా చేసుకోవచ్చు..

ఇప్పటికే ఉన్న రికార్డుల్లో ఏవైనా తప్పులుంటే వాటిని సరిచేసేందుకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆస్తులు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆధార్ సంఖ్య ద్వారా ఓటీపీ వ్యాలిడేషన్ లేదా మీసేవా కేంద్రాల్లో ఈ-కేవైసీ సహాయంతో ప్రజలు స్వయంగా తమ ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇళ్లు, అపార్ట్​మెంట్లలోని ఫ్లాట్లు, దుకాణాలు, ఇతర వివరాలను యాప్​లో పొందుపరుస్తున్నారు. నిర్మాణంతోపాటు ఖాళీ స్థలం వివరాలను కూడా పేర్కొంటున్నారు. ఖాళీ ప్లాట్ల నమోదు ప్రక్రియను మాత్రం ఇంకా చేపట్టలేదు. పురపాలక, పంచాయతీరాజ్​ వద్దనున్న వివరాల ఆధారంగా యాప్​లో ఆస్తులు నమోదు చేస్తున్నారు.

ప్రోత్సాహకాలు..

ఆన్​లైన్​లో ఆస్తుల నమోదు ప్రక్రియకు సంబంధించి మొదటి రెండు రోజుల్లో వచ్చిన సాంకేతిక సమస్యలు పరిష్కరించినట్టు అధికారులు చెప్తున్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరిస్తున్నట్టు వివరించారు. అధికారులు, సిబ్బందికి సందేహాల నివృత్తి కోసం పంచాయతీరాజ్, పురపాలకశాఖ విడివిడిగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేశాయి. ఆస్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఒక్కో వ్యవసాయేతర ఆస్తి వివరాలు నమోదు చేస్తే ఐదు రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకేరోజు 30కి మించి ఆస్తుల వివరాలు నమోదు చేస్తే... 30 దాటిన వాటికి పది రూపాయల చొప్పున ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి: సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.