నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఖరారైన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంను స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని అభినందించారు. శాలువాలతో సత్కరించారు.
అత్యంత వెనకబడిన కులానికి చెందిన తనను నామినేటెడ్ కోటా ద్వారా పెద్దల సభకు పంపడం గొప్ప గౌరవమన్న సారయ్య... బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపాపు. సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... పార్టీ గౌరవాన్ని పెంపొందించేలా ఎలాంటి మచ్చ లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.