ETV Bharat / city

PMMVY: ప్రధానమంత్రి మాతృ వందన పథకం అమలుపై నిర్లక్ష్యం - ఏపీ తాజా వార్తలు

ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై)(Pradhan Mantri Matru Vandana Yojana) సాయం కోసం ఏపీలో సుమారు లక్షన్నర మంది గర్భిణులు, బాలింతలు ఏడు నెలలుగా నిరీక్షిస్తున్నారు. తొలిసారి గర్భం దాల్చిన మహిళలకు వైద్య పరీక్షలు, పోషకాహారం కోసం ఈ పథకం కింద మూడు దశల్లో రూ.5వేల ఆర్థిక సాయం అందజేస్తారు. దీనికి ఏపీలో ఏటా సుమారు రూ.135 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు ఇవ్వాలి. గత డిసెంబరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కేంద్రం కూడా నిధులివ్వడం లేదు. ఫలితంగా ఆర్థిక సాయం నిలిచిపోయింది.

Pradhan Mantri Matru Vandana Yojan
మాతృ వందన పథకం, పీఎం మాతృ వందన పథకం
author img

By

Published : Jul 3, 2021, 9:11 AM IST

2017 జనవరిలో ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకాన్ని కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి గతేడాది డిసెంబరు వరకు ఏపీలో సుమారు 10 లక్షల మంది గర్భిణులు, బాలింతలు ఆర్థిక ప్రయోజనం పొందారు. రూ.435 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఈ పథకం కింద చెల్లింపులకు బ్యాంకులో ప్రత్యేకంగా ఖాతా తెరిచి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు జమ చేస్తున్నాయి. ఈ ఖాతా నుంచి నేరుగా గర్భిణుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్నారు. ప్రసవాల ఆధారంగా ఏటా రాష్ట్రంలో 4.5 లక్షల మంది గర్భిణులకు రూ.225 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్రం 60% వాటా ప్రకారం రూ.135 కోట్లు, రాష్ట్రం 40 శాతం వాటాగా రూ.90 కోట్లు బ్యాంకు ఖాతాలో వేయాలి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన వాటా రూ.135 కోట్లలో రూ.101 కోట్లను బ్యాంకులో జమ చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.67 కోట్లు జమ చేయాల్సి ఉన్నా చేయలేదు. దీంతో 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం నిధులు విడుదల చేయలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చిన రూ.135 కోట్ల నుంచే 2020 నవంబరు వరకు సరిపెడుతూ వచ్చారు. నిధుల్లేక డిసెంబరు నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. సుమారు లక్షన్నర మంది లబ్ధిదారులు సాయం కోసం నిరీక్షిస్తున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 30 వేల మంది లబ్ధిదారులకు రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంది. పశ్చిమ గోదావరిలో రూ.3.5 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.3 కోట్ల వంతున చెల్లించాలి. ఈ పథకం ప్రవేశపెట్టాక గర్భిణులు, పుట్టిన బిడ్డల వివరాలు పక్కాగా నమోదవుతున్నాయి. తల్లీ బిడ్డలకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వీలవుతుంది. శిశువులకు సకాలంలో వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. అయితే సాయం సరిగా అందకపోవడంతో కొత్తగా లబ్ధిదారులు పేర్ల నమోదుకు ఆసక్తి చూపడం లేదు.

బీఆర్వో ఇచ్చి మరీ..

2020-21 ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారులకు చెల్లింపుల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు (బీఆర్వో) విడుదల చేసింది. అయినా నిధులు విడుదలవకపోవడంతో లబ్ధిదారులకు చెల్లింపులు జరగలేదు. వాటిని 2021-22 ఆర్థిక సంవత్సరంలో చెల్లించేలా సర్దుబాటు ప్రయత్నం చేశారు. ఆ బిల్లులూ ఉపసంహరించుకోవడంతో కథ మొదటికొచ్చింది.

ఆరోగ్య సిబ్బందిపై రుసరుస

సాయం అందకపోవడంతో లబ్ధిదారులకు ఆశా/ఏఎన్‌ఎంలు సర్దిచెప్పలేకపోతున్నారు. తొలివిడత ఆర్థిక సాయం అందుకున్నవారు రెండు, మూడో విడతల సాయం ఎందుకు రావడం లేదని నిలదీస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది వల్లే ఆర్థిక సాయం అందడం లేదని ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదులు చేస్తున్నారు. త్వరితగతిన సాయం అందించేలా ఆర్థిక శాఖతో సంప్రదిస్తున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

పథకం లబ్ధి ఇలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.