ETV Bharat / city

No Permission: అమరావతి ఉద్యమానికి రేపటితో 600 రోజులు.. ర్యాలీకి నో... - రేపటితో 600రోజుకు ఉద్యమం

ఏపీలోని అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం రేపటితో 600వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా అమరావతి నుంచి మంగళగిరి వరకు రైతులు ర్యాలీ చేసేందుకు సంకల్పించారు. ఇందుకు అనుమతి లేదని తుళ్లూరు పోలీసులు ప్రకటించారు.

no-permission-to-amaravathi-farmers-rally
అమరావతి ఉద్యమానికి రేపటితో 600 రోజులు.. ర్యాలీకి అనుమతించని పోలీసులు
author img

By

Published : Aug 7, 2021, 12:52 PM IST

ఏపీలోని అమరావతి రైతులు తలపెట్టిన రేపటి ర్యాలీకి.. పోలీసులు అనుమతి నిరాకరించారు. రాజధాని పరిరక్షణ పేరిట అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం.. ఆదివారంతో 600వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా.. రాజధాని నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు. స్పందించిన తుళ్లూరు పోలీసులు.. అనుమతి లేదని తేల్చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు. తుళ్లూరు సీఐ పేరిట ఈ మేరకు ప్రకటన జారీ అయ్యింది.

అమరావతి కోసం.. రాజధాని రైతుల పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది. 600 రోజులు గడిచినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం.. మంత్రుల నుంచి అయోమయ వ్యాఖ్యలు వినిపిస్తున్న కారణంగా .. అమరావతి పరిధిలోని రైతులు ఆందోళన బాట పట్టారు.

ఇదీ చదవండి: ఈ ఏడైనా వినాయక తయారీదారులకు విఘ్నాలు తొలగేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.