ETV Bharat / city

సామాన్యులకు దొరకని దుర్గమ్మ దర్శనం! - విజయవాడ కనకదుర్గ ఉచిత దర్శనాలు న్యూస్

ఏపీలోని విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం సామాన్యులకు సాధ్యపడటం లేదు. గంటల వ్యవధిలోనే ఆన్ లైన్ టికెట్లన్నీ బుక్కై పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అదనంగా వస్తున్న భక్తుల కోసం అప్పటికప్పుడు 100, 300 టికెట్లు జారీ చేస్తున్న అధికారులు ఉచిత దర్శనం టికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా అప్పటికప్పుడు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన పేద భక్తులను వెనక్కి పంపుతుండటంతో వారంతా తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.

సామాన్యులకు దొరకని దుర్గమ్మ దర్శనం!
సామాన్యులకు దొరకని దుర్గమ్మ దర్శనం!
author img

By

Published : Oct 21, 2020, 9:21 AM IST

కొవిడ్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్​ విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల దర్శనాలకు అధికారులు పరిమతి విధించారు. నవరాత్రుల్లో ప్రతి రోజూ పది వేల మందికి మాత్రమే దర్శనం కల్పించాలని నిర్ణయించారు. భక్తులకు ఆన్​లైన్ ద్వారా టికెట్లు జారీ ప్రక్రియ చేపట్టారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా దుర్గా మల్లేశ్వర స్వామి వారి వెబ్ సైట్​లో ఆన్ లైన్ ద్వారా టికెట్లు తీసుకుని రావాలని స్పష్టం చేశారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అన్ని రోజులకూ దర్శన టికెట్లు ఆన్ లైన్ లో ఉంచారు. టికెట్లు పొందేందుకు భక్తులు విపరీతంగా పోటీ పడ్డారు. ఫలితంగా ఆన్ లైన్ లో కేటాయించిన టికెట్లన్నీ గంటల వ్యవధిలోనే పూర్తయ్యాయి.

ఈ నెల 25న దసరా పండుగ వరకూ ప్రతి రోజూ అన్ని సేవల టికెట్లు జారీ పూర్తైంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా ఒక్క టికెట్ కూడా లభించని పరిస్ధితి నెలకొంది. ప్రస్తుతం ఆర్జిత సేవలు, రూ.100, రూ.300 టికెట్లు సహా ఉచిత దర్శనం టికెట్లేవీ అందుబాటులో లేవని వెబ్ సైట్​లో కనిపిస్తోంది.

నవరాత్రుల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు పలుప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. స్థోమత ఉన్న వారు రూ. 100, రూ.300 టికెట్లు తీసుకుని కుటుంబమంతా దర్శనం చేసుకుంటారు. కుటుంబ సభ్యులందరికీ డబ్బు చెల్లించి టికెట్ తీసుకోలేని పేదలు ఉచిత దర్శనం చేసుకుంటారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నాక క్యూలైన్ వద్ద అప్పటి కప్పడు ఉచిత దర్శనం టికెట్ తీసుకుని క్యూలైన్లలో వెళ్లి దర్శనం చేసుకునే వారు. ఈసారి అమ్మవారి ఉచిత దర్శనం టికెట్లన్నీ ఆన్ లైన్ లోనే జారీ చేశారు. దీంతో నిరక్ష్యరాస్యులైన పలువురు భక్తులు వీటిపై అవగాహన లేక టికెట్లు తీసుకోలేదు. తీరా ఇక్కడికి వచ్చాక తీసుకుందామంటే టికెట్లన్నీ ఎప్పుడో పూర్తైపోయాయని చెబుతున్నారు.

రూ.100, రూ.300 టికెట్లు మాత్రమే అప్పటి కప్పుడు అదనంగా జారీ చేస్తున్నారు. ఉచిత దర్శన టికెట్లు ఇవ్వక పోవడంతో డబ్బు చెల్లించి దర్శనానికి వెళ్లాల్సి వస్తోంది. ఉచిత దర్శనానికి కూడా అప్పటికప్పుడు టికెట్లు జారీ చేయాలని భక్తులు కోరుతున్నారు. కొంత మంది ఆన్ లైన్ లో టికెట్లు బుకింగ్ చేసుకుని వివిధ కారణాలతో దర్శనానికి రాని వారి స్థానంలో నైనా తమకు అప్పటికప్పుడు ఉచిత దర్శనం టికెట్లు ఇవ్వాలని చెబుతున్నారు. రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లోనైనా తమకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించాలంటున్నారు.

ఇదీ చదవండి: నేడూ, రేపూ భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.