ETV Bharat / city

కరోనా వైరస్​పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం - hongkong

ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తోన్న కరోనా వైరస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా అనుమానితుల చికిత్స కోసం చేసిన ఏర్పాట్లను కేంద్ర వైద్య బృందం ఇవాళ పరిశీలించింది. గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులలోని ప్రత్యేక వార్డులను తనిఖీ చేసిన అధికారులు... అనంతరం వైద్యశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ అనుమానితులకు ఎలాంటి చికిత్స అందించాలనే విషయంపై కేంద్ర బృందం పలు సూచనలు చేసింది.

No_Corona_Virus_In_telangana
కరోనా వైరస్​పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం
author img

By

Published : Jan 28, 2020, 10:38 PM IST

కరోనా వైరస్​పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం

చైనాలో విజృంభిస్తోన్న కరోనా వైరస్​పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ రాష్ట్రానికి ముగ్గురు వైద్యులు గల వైద్య బృందాన్ని కేంద్రం పంపింది. ఈ వైద్య బృందం ఫీవర్ ఆసుపత్రి, ఎయిర్​పోర్టులను సందర్శించింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఫీవర్ ఆసుపత్రిలో 40, గాంధీలో 40, చెస్ట్ ఆసుపత్రిలో 20 పడకల చొప్పున ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ఫీవర్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డును కేంద్ర వైద్య బృందం పరిశీలించింది.

ఎయిర్​పోర్టులో ప్రత్యేక స్క్రీనింగ్​

ప్రధానంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వైద్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు అనురాధ వెల్లడించారు. వారికోసం విమానాశ్రయం​లో ప్రత్యేక స్క్రీనింగ్​ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులలో వైద్య పరీక్షలు చేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్​లో రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఆస్పత్రిలో చేరినంత మాత్రాన కరోనా ఉన్నట్లు కాదని... జలుబు, దగ్గు, జ్వరంగా ఉంటే ఎవరైనా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేపించుకోవాలన్నారు.

8 మంది అనుమానితులు ఆసుపత్రిలో చేరారు...

ఇప్పటి వరకు హైదరాబాద్​లో మొత్తం 8 మంది వరకు కరోనా వైరస్ అనుమానితులు ఆస్పత్రిలో చేరినట్లు ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. నిన్న ఇద్దరి రక్త నమూనాలు పుణే ల్యాబ్​కు పంపగా... నెగెటివ్ వచ్చిందన్నారు. మిగిలిన వారి ఆరోగ్యం కుదుటపడడం వల్ల ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఇవాళ ఉదయం చైనా నుంచి వచ్చిన ముగ్గురు కుటుంబ సభ్యులకు ఐసోలేషన్ వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

ధైర్యంగా ఆస్పత్రికి రావచ్చు

చైనా నుంచి వచ్చే ప్రయాణికులు ధైర్యంగా ఆస్పత్రికి రావొచ్చని డాక్టర్​ శంకర్​ చెప్పారు. ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క పాజిటీవ్ కేసు నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి: భారతీయుల్ని రప్పించేందుకు ముమ్మర ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.