ETV Bharat / city

ap schools:ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 'నో అడ్మిషన్ బోర్డులు'! - ఏపీ ప్రభుత్వ పాఠశాలలు

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడక్కడా 'నో అడ్మిషన్ బోర్డులు' వేలాడదీశారు. అదేంటి ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేకపోవడం ఏంటి అనుకుంటున్నారా.. అవును మీరు చూస్తుంది నిజమే.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులకు ప్రభుత్వం భారీ మొత్తం కేటాయింటడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

No Admission Boards
No Admission Boards
author img

By

Published : Sep 29, 2021, 4:03 PM IST

ఏపీ విద్యా విధానంలో ఘననీయంగా మార్పులు జరిగాయని చెప్పడానికి అద్దం పట్టే సంఘటన ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులకు జగన్​ సర్కార్​ భారీ మొత్తం కేటాయించడంతో.. సర్కారు బడులు రూపు రేఖలు చకచకా మారిపోతున్నాయి. ఫలితంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని స్కూళ్లలో అయిత్ ఏకంగా 'నో అడ్మిషన్ బోర్డులు' తగిలించడం గమనార్హం.

పాఠశాలల్లో సదుపాయాలన్నీ మెరుగవడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. కొంతకాలంలోనే అడ్మిషన్లన్నీ పూర్తయ్యాయి. తల్లిదండ్రులు కూడా కరోనా కారణంగా.. ప్రైవేట్​ పాఠశాలలు నడవకపోవడం వల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల 'నో అడ్మిషన్' బోర్డులు వెలుస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్​ లేకపోవడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.

ఇదీ చూడండి: Awareness On Rabies: నిర్లక్ష్యం వహిస్తే.. మరణమే శరణ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.