ఏపీలోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాకలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో.. 19 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థులంతా నిద్రలో ఉన్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఇళ్లలో ఉన్న సామగ్రితో పాటు తిండి గింజలు, నగదు, విలువైన వస్తువులు, భూమి పత్రాలు ఇతర వస్తువులు కాలి బుడిదయ్యాయి.
బాధితులు కట్టు బట్టలతో మిగిలారు. ప్రమాదంలో 7 గ్యాస్ సిలిండర్లు పేలిపోగా.. ఒక ద్విచక్ర వాహనం కూడా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.40 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మూడేళ్ల కూతురుని చంపి ఉరేసుకున్న తల్లి