భాగ్యనగరంలో నైట్ బజారులను ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ట్విట్టర్లో వెల్లడించారు. వీటిని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిన అభివృద్ధి చేస్తామని చెప్పారు. హుస్సేన్‌సాగర్ పరిధిలోని బుద్ధభవన్, సంజీవయ్య పార్కు మధ్య నైట్ బజారులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
నైట్ బజారులను పీపీఈ పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు టెండర్లకు ఆహ్వానించినట్లు చెప్పారు. బోర్డు వాక్, పార్కింగ్, సిట్టింగ్ తదితర సదుపాయాలతో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో పర్యటక సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడనుందని అర్వింద్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రెవెన్యూ అధికారిపై మహిళా రైతుల దాడి