ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో సముద్ర ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో విచారణ జరిగింది. ఇసుక తవ్వకాలు, రొయ్యల చెరువులపై విచారణ అక్టోబర్ 8కి వాయిదా పడింది. రాజోలు, అంతర్వేది, పలు ప్రాంతాల్లో ఇసుక తవ్వుతున్నారని ఎన్జీటీలో పిటిషన్ వేశారు. సముద్రానికి సమీపంలో అక్రమ రొయ్యల చెరువులు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరగట్లేదని ఏపీ ప్రభుత్వం వాదించింది.
కేంద్ర పర్యావరణశాఖ, కేంద్ర గనులశాఖ, ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు పంపింది. పర్యావరణ నష్టాన్ని అంచనా వేసేందుకు సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ, జిల్లా కలెక్టర్ ఉన్నారు. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది.
ఇదీ చదవండి: 35 కిలోల ప్లాస్టిక్ మింగేసిన ఆవు!