రాయలసీమ ఎత్తిపోతల పథకం( Rayalaseema Lift Irrigation) పనుల్లో హరిత ట్రిబ్యునల్ (NGT) ఆదేశాలు ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై (AP government) దాఖలైన కోర్టుధిక్కరణ పిటిషన్‌పై తీర్పును ఎన్జీటీ రిజర్వ్ చేసింది. ఈ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపట్టారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై ఎన్జీటీ-చెన్నై బెంచ్ విచారణను ముగించింది.
పనులు ఆపాలంటూ ఆదేశాలిచ్చిన తర్వాత చేపట్టిన కార్యకలాపాలపై తెలంగాణ ప్రభుత్వం(ts government) ఫోటోలు అందించింది. దీనిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) నేతృత్వంలో ఎన్జీటీ చెన్నై బెంచ్ నియమించిన నిపుణుల కమిటీ.. ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెండు రోజులు సందర్శించి నివేదిక అందించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం రెండు రాష్ట్రాల వాదనలు విన్న ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పు రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది.
ఇదీ చూడండి: RAYALASEEMA LIFT IRRIGATION: 'ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా..?'