Ponds Encroachment: హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలపై ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ అచేతన స్థితిలో ఉందంటూ ఎన్జీటీ మండిపడింది. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈనాడు, ఈటీవీ భారత్లో వచ్చిన వార్తను సుమోటోగా తీసుకొని విచారణ ఎన్జీటీ జరిపింది. 8,718 చెరువులు ఆక్రమణలకు గురైనట్లు నివేదిక ఇచ్చిన జీహెచ్‌ఎంసీ... బఫర్‌జోన్‌లో 5,343 చెరువులు ఆక్రమణలకు గురైనట్లు తెలిపింది.
చెరువుల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ వైఖరి పట్ల ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. చర్యలు మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలని జీహెచ్‌ఎంసీకి హితవు పలికింది. విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసిన ఎన్జీటీ చెన్నై బెంచ్... అప్పటిలోగా ఆక్రమణలపై తీసుకున్న చర్యలను నివేదించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.
ఇవీ చూడండి: